మంగళవారం 01 డిసెంబర్ 2020
Vikarabad - Oct 22, 2020 , 05:55:18

పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

వికారాబాద్‌: అమరవీరుల త్యాగాలు మరువలేనివని...వారి త్యాగం నుంచి ప్రతి పోలీ స్‌ చాలా నేర్చుకోవాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. బుధవారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయం లో నిర్వహించిన స్మృతి పరేడ్‌ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎస్పీ పాల్గొని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది అమరవీరుల దినోత్సవాన్ని పోలీస్‌ ఫ్లాగ్‌ డేగా నిర్వహించుకుంటు న్నామన్నారు. పోలీస్‌ ఉద్యోగం కత్తి మీద సాములాంటిదని, ఒక బాధ్యత అని అన్నా రు. అమరవీరుల త్యాగాల పునాదుల మీద తీవ్రవాదం, నక్సలిజం, ఉగ్రవాదం లాం టివి లేకుండా ఈ రోజు మనమంతా ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్నారు. విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేస్తూ సామాన్యులకు  న్యాయం అందించాలన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీస్‌ అమరవీరుల ఫొటోలు, వారి పేర్లతో ఉన్న భవనాలు చూసినప్పుడు వారి త్యాగాలను గుర్తు చేసుకోవడంతోపాటు వా రిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకుసాగాలన్న ఆలోచన రావాలన్నారు. ఇటీవల కాలం లో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పోలీసులు సైతం ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వర్తించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రషీద్‌, వికారాబాద్‌, పరిగి, తాండూరు డీఎస్పీలు సంజీవరావు, శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.