గురువారం 03 డిసెంబర్ 2020
Vikarabad - Oct 22, 2020 , 05:38:54

పనితీరు మెరుగుపర్చుకోవాలి: కలెక్టర్‌

పనితీరు మెరుగుపర్చుకోవాలి: కలెక్టర్‌

వికారాబాద్‌ రూరల్‌: ధరణి పోర్టల్‌ పనితీరును మెరుగుపర్చుకోవాలని వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. బుధవారం వికారాబాద్‌ మండల కార్యాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు. కొత్త ధరణిపోర్టల్‌ ద్వారా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. యూపీఎస్‌ వివరాలు,  ఇంటర్నెట్‌ పనితీరును పరిశీలించారు. దసరా నుంచి ప్రారంభం కానున్న ధరణి పోర్టల్‌ను విని యోగించుకోవడానికి వచ్చినవారు కొవిడ్‌ 19 నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు వివరించారు. అనంతరం తాసిల్దార్‌ కార్యాలయం పక్కనే నిర్మిస్తున్న ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆమె వెంట తాసిల్దార్‌ రవీందర్‌, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.