బుధవారం 02 డిసెంబర్ 2020
Vikarabad - Oct 21, 2020 , 05:38:01

ఆస్తుల వివరాలు నమోదు చేయించుకోవాలి

ఆస్తుల వివరాలు నమోదు చేయించుకోవాలి

 వికారాబాద్‌: నియోజక వర్గ ప్రజలు తప్పనిసరిగా తమ నాన్‌ అగ్రికల్చర్‌ ఆస్తుల వివరాలను ధరణి యాప్‌లో నమోదు చే యించుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. మంగళవారం వికారాబాద్‌ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ అధికారులు ఎమ్మెల్యే ఆనంద్‌ ఆస్తుల వివరాలను ధరణి యాప్‌లో నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్‌ మాట్లాడుతూ ఆస్తులపై ప్రజలకు హక్కు, వాటికి భద్రత కల్పించేందుకే ప్రభుత్వం కుటుంబ స్థిరాస్తుల వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణంలో ఆస్తుల నమోదు దేశంలోనే మొట్టమొద టి పెద్ద ప్రయత్నమని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారి చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గ ప్రజలు తప్పనిసరిగా తమ నాన్‌ అగ్రికల్చర్‌ ఆస్తుల వివరాలు ధరణి యాప్‌ లో నమోదు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ము న్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.