బుధవారం 25 నవంబర్ 2020
Vikarabad - Oct 21, 2020 , 05:38:06

రైతు వేదికలు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్‌

రైతు వేదికలు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్‌

 నవాబుపేట: రైతు వేదిక భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్‌ పౌ సుమిబసు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎల్లకొండ, నవాబుపేట, మీనపల్లికలాన్‌ గ్రా మాల్లో కొనసాగుతున్న రైతు వేదిక భవనాల నిర్మాణాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణాల్లో ఎలాం టి ఆలసత్వాన్ని సహించబోమన్నారు. అదేవిధంగా నిర్మాణాల్లో నాణ్యత పాటించాలన్నారు. పనులు ఇప్పటికే పూర్తి కావాల్సిఉందని త్వరగతిన పూర్తి చే యాలని అధికారుకు సూచించారు. కార్యక్రమంలో డీఈఈ రాజారత్నం, ఎంపీడీవో సుమిత్రమ్మ, ఏఈ లక్ష్మయ్య,సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి, విజయలక్ష్మి, న ర్సింహారెడ్డి, ఏపీవో లక్ష్మి, ఈసీ జ్యోతి పాల్గొన్నారు.