బుధవారం 25 నవంబర్ 2020
Vikarabad - Oct 21, 2020 , 05:27:43

అభివృద్ధి, సంక్షేమం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

అభివృద్ధి, సంక్షేమం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

తాండూరు/బషీరాబాద్‌: అభివృద్ధి, సంక్షేమం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు, యాలాల మండలం బెన్నూరు, దౌలాపూర్‌, ఎన్కెపల్లి గ్రామాలతో పాటు  బషీరాబాద్‌, ఇందర్‌చేడ్‌, పర్వత్‌పల్లి, నీళ్లపల్లిలో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా, భారీ వర్షాలతో రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పటికీ తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ముందెన్నడు లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ ఆడపడుచులకు  చీర పెట్టడమనేది తెలంగాణ సంస్కృతిలో భాగమని అందుకు ఇంటికి పెద్ద కొడుకులా రాష్ట్రంలోని ప్రతి మహిళకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ చీరెలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తాండూరులో అభివృద్ధి జరుగుతున్నదన్నారు. కరోనా, భారీ వర్షాలతో అక్కడక్కడ అభివృద్ధి పనులు నిలిచినప్పటికీ ప్రస్తుతం మళ్లీ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ప్రతి పల్లెల్లో ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తామన్నారు.  తాండూరు కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌ చైర్‌పర్సన్‌ దీప, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ మెంబర్లు, యాలాల కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, వైస్‌ ఎంపీపీ రమేశ్‌, కోకట్‌ ఎంపీటీసీ పురుషోత్తంరావు, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌పార్టీ మండల అధ్యక్షుడు సిద్రాల శ్రీనివాస్‌, ఆయాగ్రామాల సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. బషీరాబాద్‌ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ కరుణ అజయ్‌ప్రసాద్‌, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు డి.నర్సింహులు, సర్పంచ్‌లు ప్రియాంక, సాబేర్‌, వీరారెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, నాయకులు అజయ్‌ప్రసాద్‌, ఇందర్‌చేడ్‌ నర్సిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రామునాయక్‌, శ్రవణ్‌, తదితరులు పాల్గొన్నారు.