బుధవారం 24 ఫిబ్రవరి 2021
Vikarabad - Oct 20, 2020 , 05:29:51

పేదల పెన్నిధి సీఎం కేసీఆర్‌

పేదల పెన్నిధి సీఎం కేసీఆర్‌

తాండూరు రూరల్‌ /పెద్దేముల్‌: రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా, సీఎం కేసీఆర్‌ పేదల కోసం సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మండలం కరణ్‌కోట, చెంగోల్‌, చింతమణిపట్టణం, ఖాంజాపూర్‌ గ్రామాలతో పాటు పెద్దేముల్‌,  గొట్లపల్లి, జనగాంలలో  మహిళలకు బతుకమ్మ చీరెలు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఏం కేసీఆర్‌ పేదలు పండుగ పూట సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నారన్నారు. అధిక వర్షాల కారణంగా అటు రైతాంగం, పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారని, రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా నియోజకర్గంలో అనేక రోడ్లు ధ్వంసమయ్యాయని, వర్షాలు తగ్గు ముఖం పట్టగానే మరమ్మతులు చేయిస్తామని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ రూ.30 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.  కరణ్‌కోటలో ఇండ్ల సమస్యతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా చెంగోల్‌, చింతామణిపట్టణం, ఖాంజాపూర్‌ గ్రామాల అభివృద్ధికి సహకరిస్తామన్నారు. తాండూరు నుంచి తొర్మామిడి, జిన్‌గుర్తి నుంచి తట్టేపల్లి వరకు ఉన్న పెండింగ్‌ రోడ్లను పూర్తి చేయిస్తామని, అదే విధంగా వర్షాలకు పాడైన అన్ని రోడ్లను పూర్తి చేసి ప్రజల కలుగుతున్న ఇబ్బందులను దూరం చేస్తామని అన్నారు.  కార్యక్రమంలో ఆర్డీవో అశోక్‌కుమార్‌, ఎంపీపీ అనితాగౌడ్‌, జడ్పీటీసీ సభ్యురాలు గౌడి మంజుల, పీఏసీఎస్‌ చైర్మన్‌ రవిగౌడ్‌, రైతుబంధు సమితి కన్వీనర్‌ రాంలింగారెడ్డి, వైస్‌ ఎంపీపీ స్వరూప, ఎంపీటీసీ రాజ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఉమాశంకర్‌, సర్పంచ్‌ మల్లేశ్వరి, వీణ, లలిత, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. పెద్దేముల్‌ మండలంలో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచ్‌ ద్యావరి విజయమ్మ, టీఎల్‌డీఏ చైర్మన్‌ నారాయణ రెడ్డి,  ఎంపీపీ అనురాధ, జడ్పీటీసీ ధారాసింగ్‌, వైస్‌ ఎంపీపీ మధులత, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, ఎంపీటీసీ అంబరయ్య,  పార్టీ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌, రమేశ్‌, మురళీ గౌడ్‌, ప్రకాశ్‌, నర్సింహులు, ధన్‌సింగ్‌, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్‌ రెడ్డి, నరేశ్‌ రెడ్డి, శిబ్లీ, ఇతర నాయకులు  పాల్గొన్నారు.

పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించిన ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి

పెద్దేముల్‌ మండల పరిధిలోని పలు గ్రామాల పట్టభద్రులను ఓటర్లుగా సోమవారం ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి స్థానిక మండల నాయకులతో కలిసి నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు ప్రతి ఒక్కరూ వచ్చేనెల 6 వరకు తమ ఓటును నమోదు చేసుకోవాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ శ్రేణు       ఈ విషయంపై అవగాహన కలిగించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌, రమేశ్‌, మురళీ గౌడ్‌, సంగమేశ్వర్‌  ఇతర నాయకులు పాల్గొన్నారు. 

VIDEOS

logo