మంగళవారం 27 అక్టోబర్ 2020
Vikarabad - Oct 19, 2020 , 00:10:07

మహిళల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు

మహిళల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు

కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

దుద్యాలలో మహిళలకు చీరెలు పంపిణీ

బొంరాస్‌పేట : మహిళల అభ్యున్నతి కోసమే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దుద్యాలలో మహిళలకు ఎమ్మెల్యే బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు సంతోషంగా బతుకమ్మ పండుగ చేసుకోవడానికి ఏటా చీరెలను పంపిణీ చేస్తుందని అన్నారు. గతంలో ఇతర రాష్ర్టాలలో తయారైన చీరెలను మహిళలకు పంపిణీ చేస్తుండగా ఈ ఏడాది సిరిసిల్లలో చేనేత కార్మికులతో చీరెలను నేయించి మహిళలకు పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల చేనేత కార్మికులకు ఉపాధి లభించిందని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తుందని అన్నారు. ప్రజలు, రైతుల మేలు కోసమే ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిందని, ఒకసారి ప్రజలు తమ ఆస్తులను ఆన్‌లైన్‌ చేసుకుంటే వాటికి చట్టబద్ధంగా రక్షణ ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామాలలో ఆస్తుల నమోదు కోసం వచ్చే అధికారులకు ప్రజలు తమ స్థిరాస్తి వివరాలను అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు. 

-దుద్యాలను మండలంగా చేస్తాం

దుద్యాలను కొత్త మండలంగా ఏర్పాటు చేస్తామని ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం కూడా ఇచ్చామని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి చెప్పారు. దుద్యాల గ్రామానికి వంద డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. అంతకుముందు బొంరాస్‌పేట మండల కేంద్రంలో మెడికల్‌ షాపును ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ చౌహాన్‌ అరుణాదేశు, వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, ఎంపీటీసీ ఎల్లప్ప, సర్పంచ్‌ మహ్మద్‌ ఖాజా, టీఆర్‌ఎస్‌ తాలూకా యూత్‌ అధ్యక్షుడు నరేశ్‌గౌడ్‌, మండల అధ్యక్షుడు మహేందర్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ అహ్మద్‌పాషా, పార్టీ నాయకులు టీటీ రాములు, బసిరెడ్డి , యూనుస్‌, నెహ్రూనాయక్‌ పాల్గొన్నారు. 

బంట్వారం : ప్రభుత్వం ప్రతి ఇంటి అడపడుచుకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తుందని సర్పంచ్‌లు గోవింద్‌రెడ్డి, వెంకటమ్మ పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని మద్వపూర్‌, సల్బత్తాపూర్‌ గ్రామాల్లో ప్రభుత్వం పంపిణీ చేసే బతుకమ్మ చీరెలను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకత ఉందని, ప్రధానంగా ఆడపడుచులు జరుపుకొనే గొప్ప పండుగ అని చెప్పారు. ప్రభుత్వం ఆడపడుచుల కోసం బతుకమ్మ చీరెలను పంపిణీ  చేయడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సంద్యారాణి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, వీఆర్‌ఏ విజయలక్ష్మి పాల్గొన్నారు. 


logo