బుధవారం 28 అక్టోబర్ 2020
Vikarabad - Oct 18, 2020 , 00:35:12

ఆకట్టుకుంటున్న మంటపాలు, అమ్మవారి అలంకరణ

ఆకట్టుకుంటున్న మంటపాలు, అమ్మవారి అలంకరణ

ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు

తాండూరు : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు తాండూరు నియోజకవర్గంలో శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని బసవన్న కట్ట దగ్గర, సాయిపూర్‌లో ప్రత్యేక మంటపాలు ఏర్పాటు చేసి అందులో అమ్మవారి విగ్రహాలను చూడచక్కగా ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. విద్యుత్‌ కాంతులతో అమ్మవారి దేవాలయాలు, మంటపాలు విరాజిల్లుతున్నాయి. 

పాంబండ రామలింగేశ్వరస్వామి ఆలయంలో..

కులకచర్ల : మండల పరిధిలోని పాంబండ రామలింగేశ్వరస్వామి ఆలయంలో శనివారం దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల పరిధిలోని పలు గ్రామాల్లో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. logo