శనివారం 31 అక్టోబర్ 2020
Vikarabad - Oct 18, 2020 , 00:28:15

ధరణి సేవలకు సిద్ధంకండి

ధరణి సేవలకు సిద్ధంకండి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

వికారాబాద్‌ : ధరణి పోర్టల్‌ ద్వారా సేవలు అందించేందుకు తాసిల్దార్‌ కార్యాలయాల్లో మౌలిక వసతులను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. శనివారం సోమేశ్‌కుమార్‌ కలెక్టర్‌, తాసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ తాసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లు పూర్తిస్థాయిలో ధరణి పోర్టల్‌లో సేవలందించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ఈ నెల 25న సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కో ఆర్డినేషన్‌ మీటింగ్‌లను నిర్వహించాలని కలెక్టర్‌కు సూచించారు. ధరణి పోర్టల్‌ ద్వారా అందించే సేవలతో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందన్నారు. ధరణి పోర్టల్‌లో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం కలెక్టర్‌ పౌసుమిబసు మాట్లాడుతూ ధరణి పోర్టల్‌కు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని, తాసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లకు శిక్షణ ఇస్తున్నామని సీఎస్‌కు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, వికారాబాద్‌, తాండూరు ఆర్డీవోలు ఉపేందర్‌రెడ్డి, అశోక్‌కుమార్‌, తాసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లు పాల్గొన్నారు.