శనివారం 31 అక్టోబర్ 2020
Vikarabad - Oct 17, 2020 , 00:38:34

పండుగలా చీరెల పంపిణీ

పండుగలా చీరెల పంపిణీ

పరిగి : ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, పేదలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలన్నది సర్కారు ఉద్దేశమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగడ్డపల్లి, మండలం సుల్తాన్‌పూర్‌లో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరెలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సర్కారు అండగా నిలుస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పండుగలను ప్రభుత్వం నిర్వహిస్తున్నదని, బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుతున్నదని చెప్పారు. పేదలు కూడా సందడిగా పండుగ జరుపుకోవడానికి మహిళలందరికీ బతుకమ్మ చీరలు అందజేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌,  టీఆర్‌ఎస్‌ మండల మాజీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్‌ పద్మ, నార్మాక్స్‌ డైరెక్టర్‌ పి.వెంకట్‌రాంరెడ్డి, ఎంపీటీసీ కె.వెంకట్‌రాంరెడ్డి,  టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌, కౌన్సిలర్లు రవీంద్ర, నాగేశ్వర్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.