మంగళవారం 27 అక్టోబర్ 2020
Vikarabad - Oct 17, 2020 , 00:38:31

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎంపీ

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎంపీ

నవాబుపేట/వికారాబాద్‌ రూరల్‌ : భారీ వర్షానికి ఇల్లు కూలి ఎక్‌మామిడి గ్రామానికి చెందిన మేడికొండ రాజు మృతి చెందగా ఆయన భార్యాపిల్లలు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం వికారాబాద్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న రాజు భార్యను ఎంపీ రంజిత్‌రెడ్డి.. ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ఆనంద్‌తో కలిసి పరామర్శించారు. రాజు కుటుంబానికి రూ.15 వేల ఆర్థిక సాయం చేశారు.  అనంతరం గ్రామానికి చేరుకుని కూలిన ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాజు మృతి బాధాకరమన్నారు.కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఇద్దరు పిల్లల చదువు బాధ్యత  తీసుకుంటానని ఎంపీ వారికి భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి డబుల్‌బెడ్‌రూం ఇల్లు వచ్చేలా చూస్తామన్నారు. కుటుంబానికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ  మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, నాయకులు మల్‌రెడ్డి, సర్పంచ్‌ రఫీ, ఏఎంసీ మాజీ చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, గేటువనంపల్లి సర్పంచ్‌ రత్నం, నాయకులు నరేందర్‌రెడ్డి, రాములు, మాణయ్య, దేవయ్య, రాంచంద్రయ్య పాల్గొన్నారు.    


logo