శనివారం 31 అక్టోబర్ 2020
Vikarabad - Oct 16, 2020 , 02:16:06

అన్ని విధాలుగా ఆదుకుంటాం..

అన్ని విధాలుగా ఆదుకుంటాం..

  • u  భారీ వర్షాలకు పాడైన పంటలు
  • u  కాగ్నా పరివాహక పొలాల్లో ఇసుక మేటలు
  • u  వీర్‌శెట్టిపల్లి గ్రామస్తులకు అధికారుల భరోసా

 బషీరాబాద్‌: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాగ్నా నది పరివాహక గ్రామాల్లో పంట పొలాలు పాడ య్యాయి. నది ఉదృతికి పత్తి, కంది పంటలు నేలకొరిగాయి. గతంలో ఎన్నడు లేనంతగా కాగ్నా నది ఉగ్రరూపం దాల్చడంతో నది సమీపంలోని జీవన్గి, మంతట్టి, క్యాద్గీరా, న వాంద్గి, ఇందర్‌చేడ్‌ గ్రామాల్లో రైతులు సాగు చేసిన కంది, పత్తి పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. పంట పొలాల మీదుగా నది పారడంతో పంటలపై ఇసుక మేటలు వచ్చా యి. ఇంకా కొంతమంది రైతుల పొలాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. దాదాపు అన్ని పంటలు చేతికి వచ్చే సమయంలో రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి.

పంటలను పరిశీలించిన వ్యవసాయాధికారులు

 భారీ వర్షాలకు పాడైన పంటలను వ్యవసాయాధికారులు గురువారం ఆయా గ్రామాల్లో పర్యటించి వర్షాలకు కంది, పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయని గుర్తించారు. ఒకటి, రెం డు రోజుల్లో అన్ని గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచ నా వేయనున్నారు. పంటలు పరిశీలించిన వారిలో ఏఈవోలు శివకుమార్‌, రఘు, పవన్‌ ఉన్నారు.

వీర్‌శెట్టిపల్లి గ్రామస్తులకు భరోసా

 తాండూరు రూరల్‌: భారీ వర్షాలు తాండూరు ప్రజలను అతలాకుతలం చేశాయి. తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లి గ్రామం చుట్టూ కాగ్నాతో పాటు మూడు వాగులు పొంగిపొర్లాయి. దాంతో ఆ గ్రామం ద్వీపంలా మారింది. ఈ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అతి కష్టం మీద గ్రామానికి చేరుకున్నారు. అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, ఆర్డీవో అశోక్‌కుమార్‌తోపాటు అధికార బృందం గ్రామాన్ని ఖాళీ చేయాలని సూచించారు. అందుకు గ్రామస్తులు ఒప్పుకోలేదు. గ్రామం చుట్టూ వాగులు ప్రవహిస్తుండడం వల్ల ప్రమాదం పొంచి ఉందని అధికారులు ప్రజలకు నచ్చజెప్పేందుకు యత్నించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు ప్రజలకు వివరించినా ప్రజలు గ్రామంలోనే ఉండిపోయా రు. గురువారం వాగుల్లో వరద ప్రవాహం తగ్గడంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

మండలంలో కూలిన ఇండ్లు

 భారీ వర్షానికి తాండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో 8 ఇండ్లు కూలినట్లు తాసీల్దార్‌ చెన్నప్పల నాయకుడు తెలిపారు.మండలంలో నారాయణపూర్‌, బెల్కటూర్‌, చెంగో ల్‌, మల్కాపూర్‌ , ఐనెల్లి గ్రామాల్లో ఒక్కోటి చొప్పున కూల గా, తాండూరు టౌన్‌లో 3 ఇండ్లు కూలినట్లు తెలిపారు.

 దోమ : కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మం డలంలోని గుముడాల్‌ గ్రామంలో గురువారం అలీమాబే గంకు చెందిన ఇల్లు కూలిపోయింది.ఇల్లు కూలిన సమయ ంలో అలీమాబేగం కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రభుత్వం నుంచి బాధితురాలికి ఆర్థిక సాయం అందించాలని సర్పంచ్‌ సుజాత కోరారు.

 లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడుతాం

 తాండూరు: మున్సిపల్‌ పరిధిలోని 36 వార్డుల్లో యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న పేర్కొన్నారు. గురువారం మున్సిపల్‌ పరిధిలోని 13వ వార్డుతో పాటు వర్షంతో జలమయమైన కాలనీలను స్థానిక కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. మున్సిపల్‌ పరిధిలోని ప్రజలకు వర్షంతో ఇబ్బందు లు, భయం ఉంటే వెంటనే తమకు తెలపాలని పేర్కొన్నా రు.  కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్‌ నీరజా రెడ్డి, రాము, వెంకన్నగౌడ్‌, ముక్తార్‌, రవిరాజు, నేతలు జుబేర్‌లాల, హరిగౌడ్‌ పాల్గొన్నారు. 

 పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

 పెద్దేముల్‌: గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తాండూరు నియోజకవర్గం పెద్దే ముల్‌ మండలంలో రైతులు తమ పంట పొలాల్లో వేసిన వివిధ రకాల పంటలను తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యం గా రైతులు ఈ సీజనులో కంది, పత్తి, మొక్కజొన్న, వరి, చె రుకు పంటలను సాగు చేస్తున్నారు.గడిచిన నాలుగు రోలు గా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో వర్షపు వరద నీరు నిలిచి వేసిన పంటలు 60శాతం వరకు పూర్తిగా పాడైపోయాయి. మండలంలోని గాజీపూర్‌, మద నంతాపూర్‌ గ్రామాల్లో సాగు చేస్తున్న వరి చేను పూర్తిగా నేల కొరగడంతో రైతులు లభోదిబోమంటున్నారు.పంటలు న ష్టపోయిన రైతులను ప్రభుత్వమే పెద్ద మనస్సుతో ఆదుకో వాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.కనీసం పం టల సాగు కొరకు పెట్టిన లా గోడీ కూడా వెళ్లడం ప్రస్తుతం కష్టంగా ఉందని,ప్రభుత్వం పెద్ద మనస్సుతో ఆదుకోవాలని రైతులు చేతులెత్తి మొక్కుతున్నారు.

 దోమ: మండలంలోని దాదాపూర్‌లో చెరువుకు పడిన గం డ్లను గుర్తించి గురువారం పూడ్చివేశారు.కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.కట్ట బలహీనంగా ఉండడం వల్ల పలుచోట్ల గండ్లు పడి నీరు వృథాగా పోతుండడంతో ఆర్‌ఐ లింగం, సర్పంచ్‌ చెరువు వద్దకు చేరుకుని కట్టను పరిశీలించారు.గండ్లను గుర్తించి వాటిని పూడ్చివేశారు. నీటి పా రుదలశాఖ అధికారులు స్పందించి చెరువు కట్టకు మరమ్మతులు చేయించాలని సూచించారు.కార్యక్రమంలో ఉపసర్ప ంచ్‌ గఫార్‌, వీఆర్‌ఏ తిరుపతయ్య, కిట్టు, సహ చట్టం మం డల ప్రధాన కార్యదర్శి శేఖర్‌, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.