శనివారం 31 అక్టోబర్ 2020
Vikarabad - Oct 15, 2020 , 02:03:48

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

  • - ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌
  • - వివిధ గ్రామాల్లో చీరెలు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు యాదయ్య, ఆనంద్‌

 నందిగామ : మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. నందిగామ మండల పరిధిలోని ఈదులపల్లి, శ్రీనివాసులగూడ, మామిడిపల్లి గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు స్వామి, చంద్రారెడ్డి, కవితల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెల పంపిణీకి హాజరై జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేశ్‌, ఎంపీపీ ప్రియాంకగౌడ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్యతో కలిసి బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేగూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ అశోక్‌, వీర్లపల్లి ఎంపీటీసీ కట్న లత, ఎంపీడీవో బాల్‌రెడ్డి, ఏపీఎం యాదగిరి, మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యులు ఎండీ.బేగ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నర్సింహులు,  నాయకులు కట్న శ్రీశైలం, శరత్‌కృష్ణ, గోపాల్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, శ్రీహరి  పాల్గొన్నారు. 

ఆడపడుచులకు పెద్దన్నలా సీఎం కేసీఆర్‌ 

చేవెళ్ల : తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్నలా సీఎం కేసీఆర్‌ ఉన్నారని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలో చేవెళ్ల సర్పంచ్‌ బండారి శైలజాఆగిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ మల్గారి విజయలక్ష్మీరమణారెడ్డి, చేవెళ్ల పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవర వెంకట్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మద్దెల శివనీలచింటూలతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరెలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. ప్రతి ఆడబిడ్డకు పండుగ రోజు బతుకమ్మ సారెను అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ టేకులపల్లి శ్రీనివాస్‌ యాదవ్‌, సీనియర్‌ నాయకులు మల్గారి రమణారెడ్డి, బండారి ఆగిరెడ్డి, దేవరకృష్ణారెడ్డి, వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు నారాయణ, యూత్‌ సభ్యులు చింటూ, బ్యాగరి సత్తయ్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 

ప్రపంచంలోనే బతుకమ్మ పండుగ ప్రత్యేకం

మోమిన్‌పేట్‌ : పేద ఆడపడుచులు బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. గురువారం మండలంలోని బూర్గుపల్లి గ్రామంలో బతుకమ్మ చీరెలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలందరికీ పెద్దన్నగా మారి సీఎం కేసీఆర్‌ బతుకమ్మ పండుగకు చీరెలను ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో తెలంగాణ బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.  

పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే 

మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇరిగేషన్‌ కెనాల్‌ పొంగిపొర్లి మిట్యానాయక్‌ తండాలో ఇండ్లలోకి నీరు రావడంతో ఇండ్లను పరిశీలించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. అదే విధంగా వర్షపు నీటితో పూర్తిగా నిండిన నంది వాగు ప్రాజెక్టును సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసంత వెంకట్‌, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఎంపీడీవో శైలజారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.