శుక్రవారం 30 అక్టోబర్ 2020
Vikarabad - Oct 14, 2020 , 01:47:08

ఆడపడుచులకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ కానుక

ఆడపడుచులకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ కానుక

శంషాబాద్‌: ఆడపడుచులు బతుకమ్మ పండుగ సంబురంగా జరుపుకోవాలని బతుకమ్మ చీరల పంపిణీతో సీఎం కేసీఆర్‌ ఆశీర్వదించారని శంషాబాద్‌ మండల ఎంపీపీ దిద్యాల జయమ్మ, జడ్పీటీసీ నీరటి తన్వి రాజు ముదిరాజ్‌ తెలిపారు. మంగళవారం మల్కారంలో సర్పంచ్‌ కొత్త మాధవి యాదగిరిరెడ్డి, నర్కుడలో సర్పంచ్‌ సిద్దులు ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్య క్రమానికి వారు ముఖ్యఅతిథిలుగా హాజరై లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జయమ్మ మాట్లాడుతూ బతుకమ్మ చీరలు తీసుకున్న మహిళల్లో ఆనందోత్సావాలు కనిపిస్తున్నాయని తెలిపారు. నాలుగేండ్లుగా పండుగకు పెద్దన్నగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేకశ్రద్ధతో అందజేయడం జరుగుతుందని వివరించారు. జడ్పీటీసీ తన్వి మాట్లాడుతూ మహిళల పట్ల సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధికి బతుకమ్మ చీరల పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. స్రభుత్వానికి ఆడపడుచుల దీవెనలు ఎల్లవేళ్లలా ఉంటాయని పేర్కొన్నారు.