ఆదివారం 25 అక్టోబర్ 2020
Vikarabad - Oct 14, 2020 , 01:47:16

ఆన్‌లైన్‌ నమోదు పకడ్బందీగా చేపట్టాలి

ఆన్‌లైన్‌ నమోదు పకడ్బందీగా చేపట్టాలి

  • కలెక్టర్‌ పౌసుమి బసు
  • కోట్‌పల్లిలో ధరణి సర్వే పరిశీలన

కోట్‌పల్లి: మండల కేంద్రంలో నిర్వహించే ధరణి ఆన్‌లైన్‌ సర్వేను మంగళవారం కలెక్టర్‌ పౌసుమి బసు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... గ్రామాల్లో ఉండే ప్రతి ఇంటి వివరాలు పక్కాగా ధరణి ఆన్‌లైన్‌ లో నమోదు చేయాలని సూచించారు. ఏ ఒక్క ఇంటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా మిగిలి ఉండకుండా చూడాలన్నారు. పొలాల వద్ద ఉన్న వారి ఇండ్ల వివరాలను కూడా తప్పకుండా నమోదు చేయాలన్నారు. సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలన్నారు. అనంతరం కస్తూర్భా గాంధీ హాస్టల్‌ నుంచి దుర్గంధం వెదజల్లుతుందని గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్‌ హాస్టల్‌లో ఉన్న సెఫ్టిక్‌ ట్యాంక్‌ నిండితే వెంటనే మున్సిపల్‌శాఖకు సమాచారం అందించి క్లీన్‌ చేయించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం బుగ్గాపూర్‌ గ్రామంలో నిర్మించే రైతు వేదికను పరిశీలించారు. వారంలోగా నిర్మాణపు పనులను పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.  సమయానికి డాక్టర్‌ రావడం లేదని కలెక్టర్‌ దృష్టికి కొంతమంది తేగా దవాఖాన సందర్శించి సిబ్బందితో మాట్లాడుతూ డాక్టర్‌ ఎన్ని గంటలకు వస్తుందని అడిగారు. సమయానికి వచ్చేలా జిల్లా వైద్యాధికారితో మాట్లాడుతానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు లక్ష్మి, విజయలక్ష్మి, అధికారులు ఉన్నారు.


logo