గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Oct 12, 2020 , 02:02:29

దరఖాస్తులు ఆహ్వానం

  దరఖాస్తులు ఆహ్వానం

వికారాబాద్‌ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు వికారాబాద్‌ డిపో మేనేజర్‌ హరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు 30 రోజులపాటు డ్రైవింగ్‌పై శిక్షణ ఇవ్వడంతోపాటు డ్రైవింగ్‌ లైసెన్సు సైతం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన అభ్యర్థులకు భవిష్యత్తులో ఆర్టీసీ భర్తీ చేసే డ్రైవర్‌ పోస్టులలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు.

శిక్షణ పొందేందుకు 20 ఏండ్లు నిండి లైట్‌ మోటార్‌ వెహికిల్‌ లైసెన్స్‌ ఉండాలని, శిక్షణకు రూ.15600 చెల్లించి డిపోలో దరఖాస్తు చేసుకోవాలని డీఎం హరి కోరారు. త్వరలో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని, ఆసక్తి గల అభ్యర్థులు డిపోలో దరఖాస్తులు అందజేయాలని ఆయన తెలిపారు. 


logo