శుక్రవారం 30 అక్టోబర్ 2020
Vikarabad - Oct 11, 2020 , 01:12:40

ఆడబిడ్డలకు సారె..

ఆడబిడ్డలకు సారె..

  • రెండోరోజూ సందడిగా బతుకమ్మ చీరల అందజేత

 పరిగి : తెలంగాణ ఆడబిడ్డలకు అన్న సీఎం కేసీఆర్‌ అని, పండుగ సందర్భంగా ఆడపడచులకు చీరలు ప్రభుత్వం ద్వారా కానుకగా అందిస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఆడపడచులకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారు పండుగలు సంతోషంగా జరుపుకోవాలన్నది సీఎం కేసీఆర్‌ ఉద్దేశమని చెప్పారు. రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు, క్రిస్‌మస్‌ సందర్భంగా క్రిస్టియన్లకు దుస్తులు పంపిణీ చేయడంతోపాటు బతుకమ్మ పండుగకు ఆడపడచులకు చీరలు పంపిణీ చేయడం ద్వారా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక కొత్త సంప్రదాయానికి నాంది పలికిందన్నారు. తెల్లరేషన్‌కార్డు గల మహిళలందరికీ బతుకమ్మ చీరలు అందిస్తున్నామన్నారు. బతుకమ్మ పండుగ లోపే అన్ని గ్రామాలలో చీరలు పంపిణీ పూర్తిచేసేందుకు సర్కారు నిర్ణయించిందన్నారు. ఆయా గ్రామాలలోని ప్రజా ప్రతినిధులు మహిళలందరికీ చీరలు అందేలా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి పండుగను మరింత ఘనంగా నిర్వహించేలా సర్కారు కార్యక్రమాలు చేపడుతున్నదని, కొన్ని పండుగలను సర్కారే నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. బతుకమ్మ చీరల పంపిణీతో మహిళలు ఆనందంగా పండుగ జరుపుకుంటారని,

మరోవైపు చేనేత కార్మికులకు సంవత్సరం పొడవునా చేతినిండా పని ఉంటుందని తెలిపారు. తద్వారా చేనేత కుటుంబాలు ఆర్థికంగా మరింత ఎదుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, ఎంపీపీ అరవిందరావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రసన్నలక్ష్మి, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ మేడిద రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, మంగు సంతోష్‌కుమార్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌, సీనియర్‌ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గోపాల్‌, కౌన్సిలర్లు వేముల కిరణ్‌, రవీంద్ర, ఎదిరె కృష్ణ, వెంకటేశ్‌, నార్మాక్స్‌ డైరెక్టర్‌ వెంకట్‌రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రవికుమార్‌, మౌలానా, తాహెర్‌అలీ, యూనుస్‌, అన్వర్‌, అబ్దుల్‌ బషీర్‌, ఆసిఫ్‌ ఉన్నారు. 

దసరాను సంతోషంగా జరుపుకునేందుకే చీరల పంపిణీ

పూడూరు : ప్రతి మహిళ దసరా పండుగను  సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్‌ పెద్దన్నగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పూడూరులో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ అన్ని వర్గాలవారికి వారివారి పండుగలకు నూతన వస్ర్తాలు అందజేస్తూ పేదల కుటుంబాల్లో సంతోషాన్ని చూస్తున్నారని తెలిపారు. గ్రామాల్లోని పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, సర్పంచ్‌ నవ్యారెడ్డి, పరిగి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అజారుద్దీన్‌, సొసైటీ చైర్మన్‌ పి.సతీష్‌రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్‌ నర్సింహారెడ్డి, అజీం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ రాజేందర్‌, డిప్యూటీ తాసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐలు బాల్‌రాజ్‌, రాంచందర్‌రావు, నాయకులు అనంతరాములు, హరీశ్వర్‌రెడ్డి ఉన్నారు.