గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Oct 10, 2020 , 01:45:53

రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

రాష్ట్రంలో భూ వివాదాల ను శాశ్వతంగా పరిష్కరించాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిందని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు శుక్రవారం మర్రి  చెన్నారెడ్డి మానవ వనరు ల కేంద్రంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి రంగారెడ్డి, వికారాబాద్‌, మల్కాజిగిరి-మేడ్చల్‌ జిల్లాల శాసనసభ్యు లు, శాసనమండలి సభ్యులతో నియోజకవర్గాల వారీగా రెవె న్యూ సమస్యలపై మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించా రు. గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ వ్రాంతాల్లోనూ రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిని ప్రాధాన్యత పూర్వకంగా పరిష్కరిస్తామని మంత్రి హామీనిచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్లో దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న వారికి పెద్దఎత్తున ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని అన్నారు. చాలాచోట్ల ప్రజలు ఇండ్లు నిర్మించుకున్న తర్వాత వివిధ కారణాల వల్ల రిజిస్టేషన్ల ప్రక్రియను నిలిపివేశారని, దీంతో లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వారు ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని మంత్రి తెలిపారు. ఇందుకు పరిష్కా ర మార్గాలను అన్వేషించి ప్రభుత్వానికి నివేదించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఒక్కో చోట ఒక్కో సమస్య ఉందని, ఆయా సమస్యలకు అనుగుణంగా ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సంవత్సరాలుగా పేరుకుపోయిన భూ సంబంధిత సమస్యలను సేకరించి, వాటి పరిష్కారమార్గాలను ప్రభుత్వానికి సూచించాలని అధికారులను కోరారు. 

ప్రజల సమస్యలన్నింటినీ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వాటికి శాశ్వత పరిష్కారం అం దించే విధంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతంలో రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్‌ బోర్డు, అటవీ శాఖ అధికారుల సమన్వయ లోపంతో పలు సమస్యలు ఉత్ప న్నమవుతున్నాయని, వాటి పరిష్కారానికి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతీ భూమిని రెవె న్యూ రికార్డుల్లోకి ఎక్కించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు స్వచ్చందంగా సహకరించాలని కోరారు. తమ ఆస్తులపైన హక్కులకు భద్రత కల్పించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నానికి మద్దతు తెలిపాలని కోరారు. వ్యవసాయేతర భూములకు సంబంధించిన వివరాలను 15 రోజుల్లోగా ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేశామని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వారి ఆస్తులకు సంబంధించి సంపూర్ణ హక్కులు దక్కడంతో పాటు క్రయవిక్రయాలు జరిపేందుకు ఎలాంటి సమస్యలు ఉండకుండా చూస్తామని తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సరళీకృత  విధానాలను,అవలంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలను మరింత జరిలం చేయకుండా అధికారులు ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌లు తీగల అనితారెడ్డి, సునీతారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ, మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌  కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, లోక్‌సభ సభ్యులు రం జిత్‌రెడ్డి, శాసనమండలి సభ్యులు జనార్దన్‌రెడ్డి,  నారాయణరెడ్డి, శాసనసభ్యులు వివేకానంద, కృష్ణారావు, సుభాశ్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, యాదయ్య, మహేశ్‌రెడ్డి,  ఆనంద్‌, రోహిత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo