మంగళవారం 20 అక్టోబర్ 2020
Vikarabad - Oct 08, 2020 , 07:42:43

నెలాఖరులోగా రైతు వేదికలు పూర్తి చేయాలి

నెలాఖరులోగా రైతు వేదికలు పూర్తి చేయాలి

  • వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు 

 కొడంగల్‌/దౌల్తాబాద్‌:  ఈ నెల చివరి నాటికి రైతువేదికల నిర్మాణం పూర్తి చేయాలని వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు సర్పంచ్‌లతో పాటు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం దౌల్తాబాద్‌, కొడంగల్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అదేవిధంగా వైకుంఠధామాలు, ప్రకృతివనం, డంపింగ్‌యార్డ్‌లు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


logo