బుధవారం 21 అక్టోబర్ 2020
Vikarabad - Oct 08, 2020 , 07:38:37

‘ఓటు’ను నిర్లక్ష్యం చేయొద్దు

‘ఓటు’ను నిర్లక్ష్యం చేయొద్దు

  • ఎమ్మెల్యే ఆనంద్‌
  • పట్టభద్రుల ఓటరు నమోదు పత్రాలు అందజేత

వికారాబాద్‌  : పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటును నమోదు చేసుకోవాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ సూచించారు. బుధవారం వికారాబాద్‌ శివరాంనగర్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఓటు నమోదు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి వార్డులో టీఆర్‌ఎస్‌ తరపున ఒక ఇన్‌చార్జిని నియమించారని, వారి సహాయంతో పట్టభద్రులు ఓటును నమోదు చేయించుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి  తదితరులు ఓటరు నమోదు పత్రాలు అందజేశారు. 


logo