గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Oct 06, 2020 , 00:13:34

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిద్దాం

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిద్దాం

వికారాబాద్‌:  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకుందామని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల అన్నారు. సోమవారం వికారాబాద్‌ పట్టణంలోని శివరామ్‌నగర్‌ కాలనీలో పర్యటించి పట్టభద్రుల ఓటు నమోదుపై డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిగ్రీ చదివిన విద్యార్థులతో చర్చించి వారు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తమ పేర్లను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్‌ గాయత్రి లక్ష్మణ్‌, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, గోపాల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రమేష్‌కుమార్‌, సుభాన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు పాల్గొన్నారు. 

పట్టభద్రుల నమోదులో టీఆర్‌ఎస్‌ నాయకులు

బొంరాస్‌పేట: ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పట్టభద్రుల పేర్లు నమోదు చేసే కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్‌ నాయకులు చురుకుగా పాల్గొంటున్నారు. కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు మండలంలోని వివిధ గ్రామాలలో డిగ్రీ పూర్తి చేసిన వారిని గుర్తించి ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. సోమవారం దుద్యాలలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ అహ్మద్‌పాషా, మాజీ సర్పంచ్‌ రంగయ్య, గ్రామ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నర్సింహులు గౌడ్‌, రైతుబంధు అధ్యక్షుడు రమేశ్‌ తదితరులు పట్టభద్రులతో దరఖాస్తులు పూర్తి చేసి తాసిల్దార్‌ కార్యాలయంలో అందజేశారు. కాకర్లగండితండాలో రవినాయక్‌, లగచెర్లలో రవీందర్‌రెడ్డి పట్టభద్రులను నమోదు చేయించారు. సోమవారం 35 మంది పట్టభద్రులు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు కోసం దరఖాస్తులు చేసినట్లు డిప్యూటీ తాసిల్దార్‌ రవి తెలిపారు.


logo