గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Oct 06, 2020 , 00:13:22

ఆస్తుల సర్వేకు సహకరించాలి

ఆస్తుల సర్వేకు సహకరించాలి

వికారాబాద్‌: ఆస్తుల సర్వేకు సహకరించాలని ఎమ్మెల్యే ఆనంద్‌ తెలిపారు. సోమవారం వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని ఆలంపల్లిలో వ్యవసా యేతర ఆస్తుల నమోదు ప్రక్రియను ఎమ్మెల్యే ఆనంద్‌ పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తప్పకుండా అన్ని కట్టడాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని సూ చించారు. ఇంటి యజమాని, ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ నం బర్‌ వివరాలు అందజేయాలన్నారు. సర్వే కోసం వచ్చే అధికారులకు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల, స్థానిక కౌన్సిలర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు రమేష్‌కుమార్‌, తదితరులు ఉన్నారు. 

 అనుమానాలుంటే మా దృష్టికి తీసుకు రావాలి

వికారాబాద్‌ రూరల్‌: వ్యవసాయేతర భూముల, ఇండ్ల వివరాలు సేకరించే సమయంలో ఎలాంటి అనుమానాలు వచ్చినా తమ దృష్టికి తీసుకు రావాలని జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా తెలిపారు. సోమవారం మండల పరిధి లోని గోధుమగూడ గ్రామంలో సర్వే చేస్తున్న తీరును పరి శీలించారు. ప్రతి ఇంటికి కచ్చితంగా వెళ్లి వివరాలు సేకరించాలని కార్యదర్శికి సూచించారు. ఏ కాలనీలో సర్వే చేస్తారో ముందురోజు సమాచారం అందించాలని గ్రామ సర్పంచ్‌ అనితకు సూచించారు.  ఆమె వెంట ఎంపీవో నాగరాజు ఉన్నారు. కాగా ఆదివారం నమస్తే తెలంగాణ దినపత్రికలో మేన్‌పేజీలో వచ్చిన “వివరాలు చాలు పత్రాలేం వద్దు” అన్న కథనాన్ని చూపిస్తూ ఇంటి యజమాని అనుమానాలను 31వ వార్డు కౌన్సిలర్‌ గాయత్రి లక్ష్మణ్‌ నివృతి చేశారు. 

ప్రతి ఇంటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

బొంరాస్‌పేట: వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో నిర్మించుకున్న ప్రతి ఇంటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ఇంటికి వచ్చే అధికారులకు ప్రజలు సహకరించి ఇంటి వివరాలను ఇవ్వాలని ఎంపీడీవో హరినందనరావు అన్నారు. సోమవారం మండలంలోని రేగడిమైలారంలో ఆన్‌లైన్‌లో ఇండ్ల నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ప్రజలు నిర్మించుకున్న ఇండ్లను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని అందుకు అనుగుణంగా గ్రామాల్లో అధికారులు ఇంటింటికి తిరిగి ఇంటి వివరాలను తెలుసుకుని ఆన్‌లైన్‌లో చేస్తున్నారన్నారు. పంచాయతీ కార్యదర్శులు పక్కాగా సమాచారం సేకరించి గడువులోగా ఆస్తుల వివరాలను నమోదు చేయాలని ఎంపీడీవో సూచించారు. సోమవారం కూడా పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవో పాండు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

ముమ్మరంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే

నవాబుపేట: మండలంలో ఇంటింటి సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. వ్యక్తిగత ఆస్తు  లతో పాటు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన వివరాల సేకరణలో అధికారులు నిమగ్న మైయ్యారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఇంటి నిర్మాణాల కొలతల సేకరణ అదే విధంగా ఖాళీ స్థలాల కొలతలను నిర్వహించి వివరాలను రికార్డులో నమోదు చేస్తున్నారు. సేకరించిన వివరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్‌బీపీ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇంటి నిర్మాణం కొలతలు, ఖాళీ స్థలం వివరా లను నమోదుతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్‌ కార్డు నెంబరు, రేషన్‌ కార్డు నెంబరు తదితర వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. 


logo