గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Oct 05, 2020 , 01:23:54

జోరుగా ఆస్తుల వివరాల నమోదు

జోరుగా ఆస్తుల వివరాల నమోదు

వికారాబాద్‌, కొడంగల్‌లో ప్రక్రియ   షురూ

ఆస్తుల రక్షణ కోసమే ఆన్‌లైన్‌ విధానం

బొంరాస్‌పేట: మండలంలోని గ్రామాలలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములలో నిర్మించిన ఇంటి వివరాలను నమోదు చేసే కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి ఇంటి యజమానితో పాటు కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డు సంఖ్య, వయస్సు, ఇంటి యజమానితో సంబంధం, కరెంటు బిల్లు వంటి వివరాలను యజమాని ఫొటోను, ఇంటి ఫొటోను క్యాప్చర్‌ చేసి టీఎస్‌ఎన్‌బీపీ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఆదివారం బొంరాస్‌పేట, నాగిరెడ్డిపల్లి, చిల్‌ముల్‌మైలారం తదితర గ్రామాల్లో డీఎల్‌పీవో చంద్రశేఖర్‌, ఎంపీవో పాండు పర్యటించి నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. వివరాల నమోదును వేగవంతం చేయాలని డీఎల్‌పీలో కార్యదర్శులను ఆదేశించారు. 

గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

 మండలంలోని అన్ని గ్రామాలలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములలో నిర్మించిన ఇండ్లను ధరణి పోర్టల్‌లో పొందుపర్చే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య మండలంలోని 47 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు ఎంపీడీవో హరినందనరావు  తెలిపారు. బొంరాస్‌పేట, బాపన్‌చెరువుతండా, బొట్లవానితండా, చౌదర్‌పల్లి, దుప్‌చెర్ల, ఎన్నెమీదితం డా, గౌరారం, కొత్తూరు, లింగన్‌పల్లి, మూడుమామిళ్లతండా, నాగిరెడ్డిపల్లి, రేగడిమైలారం, సాగారం తండా, తుంకిమెట్ల, వడిచెర్ల, ఎన్నెమీదితండా, ఎనికేపల్లి గ్రామాలకు ఎంపీడీవో హరినందనరావు, దుద్యాల, అల్లికాన్‌పల్లి, లగచెర్ల, రోటిబండతండా, బాపల్లి తండా, చిల్‌ముల్‌మైలారం, సత్తుర్‌కుంటతండా, ఎక్కచెరువుతండా హంసాన్‌పల్లి, నాందార్‌పూర్‌, ఏర్పుమళ్ల, కాకర్లగండితండా, సండ్రకుంటతండా, ఈర్లపల్లి, నాస్కంపల్లి, చెట్టుపల్లితండాలకు ఎంపీవో పాండు, బురాన్‌పూర్‌, మదన్‌పల్లితండా, మదన్‌పల్లి, సూర్యానాయక్‌తండా, కూబ్యానాయక్‌తండా, టేకులగడ్డతండా, సాలిండాపూర్‌, గట్టెగానితండా, బుర్రితండా, మెట్లకుంట, మహంతిపూర్‌, జానకంపల్లి, మేడిచెట్టుతండా, లోతుకుంటతండాలకు తాసిల్దార్‌ షాహెదాబేగంలను ప్రత్యేకాధికారులుగా నియమించినట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన గ్రామాలలో  పర్యవేక్షిస్తూ నివేదికలను పంపించాలని అదనపు కలెక్టర్‌ చంద్రయ్య ఆదేశించినట్లు చెప్పారు. 

ప్రజలు  సిబ్బందికి  సహకరించాలి

ధారూరు : గ్రామ ప్రజలు తమ ఆస్తి వివరాలను పంచాయతీ సిబ్బందికి తెలిపి సహకరించాలని డీఎల్‌పీవో అనిత అన్నారు. ఆదివారం ధారూరు మండల పరిధిలోని స్టేషన్‌ ధారూరు గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పరిశీలించారు.  ఈ సందర్భంగా డీఎల్‌పీవో అనిత మాట్లాడుతూ  ఆస్తుల రక్షణ కోసమే అన్‌లైన్‌ విధానమన్నారు. కార్యక్రమంలో  ధారూరు ఎంపీడీవో అమృత, పంచాయతీ కార్యదర్శి అంజన్‌నాయక్‌, సర్పంచ్‌ రేణుకా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

మర్పల్లి మండలంలో...

మర్పల్లి: మండలంలోని కోట్‌ మర్పల్లిలో ఇండ్లు, ఆస్తుల సర్వేను ఎంపీడీవో సురేశ్‌బాబు  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న అన్ని ఇండ్ల వివరాలను  సేకరిం చాలన్నారు. ఇండ్లు ఆస్తుల వివరాలను పంచాయతీ పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా గ్రామ పంచాయతీలోని ఆస్తుల వివరాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.  కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వప్న, వార్డు సభ్యుడు జైహింద్‌రెడ్డి,  కారోబార్‌ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

వేగవంతం చేయాలి : ఎంపీడీవో శైలజా రెడ్డి 

మోమిన్‌పేట్‌:గ్రామాల్లో ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపీడీవో శైలజా రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఎన్కతల,మొరంగపల్లి, వెల్‌చాల్‌, దుర్గంచెర్వు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆస్తుల వివరాల నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న  అన్ని ఇండ్ల వివరాలను కొలతలతో సహా సేకరించి పంచాయతీ ఈ పోర్టర్‌లో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం విధించిన గడువుకు ముందుగానే వివరాలను సేకరించేందుకు పంచాయతీ కార్యదర్శులు  శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇండ్లు, ఆస్తుల వివరాలను పంచాయతీ పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా గ్రామ పంచాయతీలో ఆస్తుల వివరాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.