శనివారం 31 అక్టోబర్ 2020
Vikarabad - Oct 05, 2020 , 01:23:23

ప్రగతి దిశగా ‘పరిగి’

ప్రగతి దిశగా ‘పరిగి’

ప్రత్యేక చొరవ చూపుతున్న మంత్రి కేటీఆర్‌ 

అభివృద్ధికి రూ.20కోట్లు మంజూరు

రూ.5కోట్లతో మున్సిపల్‌ భవనం  

రూ.5కోట్లతో సీసీరోడ్డు, డ్రైనేజీలు

ఇప్పటికే పలు పనులు ప్రారంభం

మారనున్న రూపురేఖలు

పరిగి : పరిగి పురపాలక సంఘం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. రాబోయే ఏడాది లోపు పరిగి పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. పరిగి పట్టణాభివృద్ధికి మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో రూ.15 కోట్లు మంజూరు చేయగా, ఇటీవల ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి వినతి మేరకు మున్సిపల్‌ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరుకు హామీనిచ్చారు. తద్వారా రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడానికి సంబంధించి ఇప్పటికే రూ.9.97కోట్ల విలువ చేసే పనులకు టెండర్లు పూర్తి చేయబడి ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి. మిగుతా వాటిలో రూ.5కోట్లతో పలు కాలనీలలో సీసీ రోడ్లు, మురికికాలువల నిర్మాణానికి సంబంధించి రెండు రోజులలో ప్రత్యేక సర్వే చేపట్టనున్నారు.  

రూ.9.97కోట్ల పనులు ప్రారంభం...

పరిగి పురపాలక సంఘంలో అభివృద్ధి పనులకు రూ.15 కోట్లు మంజూరవగా మొదటి విడతలో రూ.9.97కోట్ల విలు వ చేసే పనులకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. పను ల నిర్మాణ పనులలో కొన్ని ఇటీవల ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఈ పనులు ప్రారంభం చేపట్టారు. ఇందులో ప్రధానంగా రూ.1.67కోట్లతో తాసిల్దార్‌ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు రోడ్డు వెడల్పు, రూ.50లక్షలతో తాసిల్దార్‌ కార్యాలయం నుంచి నస్కల్‌ రోడ్డులో గల కల్వర్టు వరకు రోడ్డు డివైడర్‌, ఇతర పను లు, రూ.50లక్షలతో తాసిల్దార్‌ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు డివైడర్‌ ఏర్పాటు, రూ.కోటి 44లక్షలతో గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు సీసీ, బీటీ రోడ్లు, డివైడర్‌ నిర్మాణం, రూ.కోటి 71లక్షలతో పరిగి నుంచి తుంకులగడ్డ రోడ్డులోని వాగు వద్ద నుంచి సాం ఘిక సంక్షేమ గురుకులం వరకు బీటీ రోడ్డు, రూ.29లక్షలతో తాసిల్దార్‌ కార్యాలయం నుంచి పోస్టాఫీసు వరకు డివైడర్‌ ఏర్పాటు, రూ.కోటి 50లక్షలతో వివిధ కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.49లక్షలతో తాసిల్దార్‌ కార్యాలయం నుంచి పోస్టాఫీసు వరకు సీసీ రోడ్డు నిర్మాణం, రూ.37లక్షలతో తాసిల్దార్‌ కార్యాలయం నుంచి నస్కల్‌ రోడ్డులోని కల్వర్టు వరకు మురికికాలువ నిర్మాణం, రూ.20లక్షలతో సిద్దప్ప హోటల్‌ నుంచి తుంకులగడ్డ బ్రిడ్జి వరకు మురికికాలువ నిర్మాణం, రూ.30లక్షలతో తాసిల్దార్‌ కార్యాలయం, మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జంక్షన్‌ల అభివృద్ధి, రూ.50లక్షలతో డంపింగ్‌యార్డు, రూ.50లక్షలతో తుంకులగడ్డలో శ్మశానవాటిక పనులు చేపట్టనున్నారు. టెండర్లు పూర్తయిన ఈ పనులలో కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మిగతా రూ.5కోట్లతో ఏ పనులు చేపట్టాలన్నది గుర్తించి, సర్వే నిర్వహించేందుకు కన్సల్టెన్సీకి అప్పగించారు. రెండు రోజులలో సర్వే పనులు ప్రారంభమవనున్నాయి. అనంతరం ఆయా పనులకు సంబంధించిన అంచనాలు తయారుచేసి టెండర్లు నిర్వహించనున్నారు. ఇందులో ఇందిరాగాంధీ విగ్రహం నుంచి తాసిల్దార్‌ కార్యాలయం, గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం, తాసిల్దార్‌ కార్యాల యం నుంచి పోస్టాఫీసు వరకు రోడ్డు వెడల్పు చేపట్టి డివైడర్లు ఏర్పాటుతోపాటు సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఈ రోడ్లు 3.7మీటర్ల వెడల్పు ఉండగా, 15 మీటర్ల వెడల్పుతో కొత్త రోడ్ల నిర్మాణం జరగనుంది. మధ్యలో 1.2మీటర్ల వెడల్పుతో డివైడర్లు ఏర్పాటుచేసి, మధ్యలో మొక్కలు పెంచనున్నారు. అలాగే సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు కానుంది. గాంధీ విగ్రహం నుంచి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా వరకు లోతట్టు ప్రాంతంగా ఉండడంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపడతారు. ముందుగా ఇందిరాగాంధీ విగ్రహం నుంచి తాసిల్దార్‌ కార్యాలయం వరకు రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమయ్యాయి.  

రూ.5కోట్లతో మున్సిపల్‌ కార్యాలయం భవనం

పరిగి పురపాలక సంఘం కార్యాలయం నూతన భవనాన్ని అన్ని సదుపాయాలతో నిర్మించనున్నారు. రూ.5కోట్ల అంచ నా వ్యయంతో ఈ భవనం నిర్మాణం చేపడతారు. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో పురపాలక సంఘం భవనం నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి స్వయంగా మున్సిపల్‌ శాఖమంత్రి కేటీఆర్‌ను కోరగా తప్పనిసరిగా నిధులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా ఈ నిధులు మంజూరు చేయించేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి భవనం ఇరుగ్గా మారింది. పరిగి పురపాలక సంఘం కార్యాలయం నూతన భవనాన్ని అన్ని రకాల సదుపాయాలతో నిర్మాణం చేపట్టనున్నారు. కొత్త భవనం నిర్మాణానికి సంబంధించి డిజైన్లను పరిశీలించి నిర్ణయించనున్నారు. ఇటీవలికాలంలో రాష్ట్రంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన మున్సిపల్‌ కార్యాలయ భవనాలను పరిశీలించి, అన్ని వసతులతో కూడిన భవనం నిర్మాణానికి పాలకవర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది. ప్రాథమికంగా జీ ప్లస్‌ టూ విధానంలో భవనం నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నారు. 

డబ్బాల ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలు...

పరిగి పట్టణంలోని గంజ్‌రోడ్డు, తాసిల్దార్‌ రోడ్డు వెడల్పు పనులు చేపడుతుండడంతో ఈ రోడ్లపై గల డబ్బాలను ఏర్పా టు చేసేందుకు ప్రత్యామ్నాయంగా స్థలం చూపించేందుకు కసరత్తు జరుగుతుంది. ఇటీవల ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి స్వయంగా పట్టణంలోని గంజ్‌రోడ్డులో పర్యటించి డబ్బా ల యజమానులతో మాట్లాడారు. ఎస్‌బీఐ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు గల డబ్బాల వారు ఆర్టీసీ వారి స్థలంలో డబ్బాల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ విషయమై ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అం దించాలని, ఉన్నతాధికారులతో తాను సైతం మాట్లాడతానని, వారు అనుమతిస్తే ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. 


పరిగి పట్టణ రూపురేఖలు మారతాయి 

పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధి పనులు ప్రారంభమవగా, రాబోయే ఏడాదిలో పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లడం తో అభివృద్ధి పనులకు రూ.15కోట్లు మంజూ రు చేశారు. మున్సిపల్‌ కార్యాలయం భవన నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరుకు మంత్రి హామీనిచ్చారు. రూ.9.97కోట్లకు సంబంధించిన పనుల టెండర్లు పూర్తి చేయబడ్డా యి. ఇందులో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మిగతావి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. 

ముకుంద అశోక్‌, చైర్మన్‌, పరిగి మున్సిపాలిటీ