గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Oct 04, 2020 , 00:17:31

ఆపదలో బంధువుగా..

ఆపదలో బంధువుగా..

  • మంత్రి కేటీఆర్‌ ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' పిలుపునకు స్పందించి  అంబులెన్స్‌లు అందజేసిన ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

షాబాద్‌: మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఇచ్చిన ‘గిప్ట్‌ ఏ స్మైల్‌' పిలుపునకు స్పందించిన పలువురు టీఆర్‌ఎస్‌  ప్రజాప్రతినిధులు కొవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్స్‌లను ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. దీనిలో భాగంగా చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తన పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఎనిమిది అంబు లెన్స్‌లను ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వీటిలో ఆయన పుట్టినరోజున ఐదు అంబులెన్స్‌లను ఇచ్చారు. మిగిలిన మూడు అంబులెన్స్‌లను శనివారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌  జెండా ఊపి ప్రారంభించారు. అలాగే  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ  పట్నం మహేందర్‌రెడ్డి రూ. 20.50లక్షలతో అంద జేసిన అంబులెన్స్‌ను శనివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌  ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో మంత్రులు ఈటల రాజేందర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. logo