ఆదివారం 25 అక్టోబర్ 2020
Vikarabad - Oct 03, 2020 , 04:48:42

అలరించిన 2కే రన్‌

అలరించిన 2కే రన్‌

వికారాబాద్‌ రూరల్‌ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వికారాబాద్‌ పట్టణంలోని బ్లాంగ్‌గ్రౌడ్‌ నుంచి అనంతపద్మనాభ కళాశాల వరకు జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం 2కే రన్‌ నిర్వహించారు.  ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆనంద్‌, అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, జిల్లా క్రీడ, యువజన సంఘాల అధికారి హన్మంతురావు హాజరై రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ నివాళులర్పించారు. గాంధీపార్కులో ఎమ్మెల్యే ఆనంద్‌, చైర్‌పర్సన్‌ మంజుల,  కలెక్టర్‌ పౌసుమిబసు గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్‌ కార్మికులను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆనంద్‌ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. సిద్దులూరు అంగన్వాడి కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా మొక్కలు నాటారు. తాసిల్దార్‌ కార్యాలయంలో తహసిల్దార్‌ రవీందర్‌ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. 


logo