ఆదివారం 25 అక్టోబర్ 2020
Vikarabad - Oct 02, 2020 , 00:58:21

టెక్నాలజీతో కేసులు పరిష్కరించాలి

టెక్నాలజీతో  కేసులు పరిష్కరించాలి

వికారాబాద్‌: పోలీస్‌ అధికారులు టెక్నాలజీని ఉపయోగించుకుని కేసులను త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ నారాయణ సూచించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్‌ స్టేషన్‌ల వారిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  స్టేషన్‌ల వారిగా నమోదైన కేసుల వివరాలను, పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి, ఎన్‌బీఎం పెండింగ్‌, ఈ పెట్టీ కేసుల  పెండింగ్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే 100 డైల్‌ పట్ల ప్రతి పోలీస్‌ అధికారి వెంటనే స్పందించి బాధితులకు సహాయం చేయాలన్నా రు. జిల్లాలోని ప్రతి పోలీస్‌ అధికారి పూర్తి అవగాహనతో  నిబద్ధతతో పని చేయాలని తెలిపారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్‌, డీఎస్పీలు శ్రీనివాస్‌లు, లక్ష్మీనారాయణ, సంజీవరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మారెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు  పాల్గొన్నారు.


logo