ఆదివారం 25 అక్టోబర్ 2020
Vikarabad - Sep 25, 2020 , 01:43:01

పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

  • టీఆర్‌ఎస్‌ అభివృద్ధికోసం పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి
  • ఓటు నమోదు అవగాహన సమావేశంలో మంత్రి సబితారెడ్డి
  • ఓటరు నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేపట్టాలి
  • ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
  • అభివృద్ధి, సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ పార్టీ నిదర్శనం
  • రాష్ట్ర విద్యా మౌలిక  సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌

తాండూరు : అర్హులైన పట్టభద్రులు విధిగా ఓటును నమోదు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలో నిర్వహించిన గ్రాడ్యుయేట్స్‌ ఓటుహక్కు నమోదు అవగాహన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2017, అంతకు ముందు డిగ్రీ, ఇంజినీరింగ్‌తో సహా తత్సమానమైన విద్య పూర్తి చేసిన వారు అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 6 వరకు ఆన్‌లైన్‌లో ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని సూచించారు. నవంబర్‌ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందిస్తారని, డిసెంబర్‌ 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఫలాలు అందడంతో పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయం సాధించిందని అన్నారు. 

తెలంగాణ సర్కార్‌ వివిధ నియామకాల ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు.  తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌దేనని అన్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పట్టభద్రులను ఓటరుగా నమోదు చేయడంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాండూరు ప్రాంతంలో అర్హులైన పట్టభద్రులను అత్యధిక సంఖ్యలో ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొనేలా చూస్తామన్నారు.

 రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతి నిత్యం ఒక శక్తిలా పనిచేస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ పారీ నిదర్శనమన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌ చైర్‌పర్సన్‌ దీప, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌ రావుఫ్‌, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల, బషీరాబాద్‌ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌  నేతలు పురుషోత్తంరావు, రవిగౌడ్‌, లక్ష్మారెడ్డి, అజయ్‌ప్రసాద్‌, విఠల్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.


logo