సోమవారం 19 అక్టోబర్ 2020
Vikarabad - Sep 25, 2020 , 01:41:59

రైతు వేదిక భవనాలను త్వరగా పూర్తిచేయాలి

రైతు వేదిక భవనాలను త్వరగా పూర్తిచేయాలి

కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్‌, ఇన్ముల్‌నర్వలో రైతు వేదికలను 

పరిశీలించిన కలెక్టర్‌

కొత్తూరు : రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్‌, ఇన్ముల్‌నర్వలో నిర్మిస్తున్న రైతు వేదికలను కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు సమన్వయ వేదికలను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. 

ఇన్ముల్‌నర్వలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను గురించి సర్పంచ్‌ అజయ్‌నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. రైతు సమన్వయ వేదికను నాణ్యతతో నిర్మించాలని సర్పంచ్‌కు సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలించి త్వరగా పూర్తయ్యేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ తనిఖీలో తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ ఏఈ హేమంత్‌రాజ్‌, డిప్యూటీ సర్పంచ్‌ శ్రీరామ్‌యాదవ్‌, మాజీ సర్పంచ్‌ మిట్టూనాయక్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


logo