బుధవారం 21 అక్టోబర్ 2020
Vikarabad - Sep 18, 2020 , 02:27:42

పల్లె ప్రగతి పనులను పూర్తిచేయాలి

పల్లె ప్రగతి పనులను పూర్తిచేయాలి

ఎంపీడీవో హరినందనరావు

బొంరాస్‌పేట : పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో హరినందనరావు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండలంలోని సత్తుర్‌కుంటతండా, ఈర్లపల్లి గ్రామాల్లో గురువారం పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, కంపోస్టు షెడ్‌ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులు నిదానంగా జరుగుతున్నాయని వేగవంతం చేయాలన్నారు. సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పల్లె ప్రకృతి వనాల్లో పండ్లు, పూల మొక్కలు నాటాలన్నారు. ఆయన వెంట ఏపీవో రజనీకాంత్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు రాజు నాయక్‌ ఉన్నారు.  


logo