బుధవారం 28 అక్టోబర్ 2020
Vikarabad - Sep 18, 2020 , 02:27:44

పోచారం పంచాయతీ కార్యాలయం దగ్ధం

పోచారం పంచాయతీ కార్యాలయం దగ్ధం

రికార్డులకు తృటిలో తప్పిన ప్రమాదం

బూడిదైన 30 బ్లీచింగ్‌ పౌడర్‌ బ్యాగులు

అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చిన స్థానికులు

 ఆదిబట్ల: పోచారం గ్రామ పంచాయతీ కార్యాలయం బుధవారం రాత్రి దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తి కార్యాలయాన్ని దగ్ధం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇబ్రహీంపట్నం సీఐ సైదులు, గ్రామస్తులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి బుధవారం సాయంత్రం సిబ్బంది తాళం వేసి ఇంటికి వెళ్లి పోయారు. రాత్రి 10:30గంటల ప్రాం తంలో  కార్యాలయం నుంచి ఒక్క సారిగా మంటలు, పొగ రావటంతో స్థానికులు కొందరు ఇబ్రహీంపట్నం పోలీసుల కు సమాచారం అందించారు. అప్పటికే కార్యాలయం వరండాలో 30 బ్లీచింగ్‌ పౌడర్‌ బ్యాగులు భద్రపరచగా బ్యాగులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సర్పంచ్‌ ఛాంబర్‌ తలుపు లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీని పక్కనే గ్రామ కార్యదర్శి కార్యాలయంలో పంచాయతీకి సంబంధించిన ముఖ్యమైన రికార్డులు ఉన్నాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తేవడంతో  ప్రమాదం తప్పింది. సర్పంచ్‌ ఓరుగంటి అరుణ, పంచాయతీ వార్డు సభ్యులు,కొందరు యువకులు మంటలను ఆర్పి వేసేందుకు కృషి చేశారు. పోచారం గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమాలపై జూలై నెలలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లకు డీఎల్‌పీవో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.గురువారం ఆడిట్‌ జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం గ్రామ కార్యదర్శి విక్టోరియా కార్యాలయం దగ్ధంపై పోలీసులకు ఫిర్యాదు చే యగా సీఐ సైదులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.కార్యాలయంలో సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలించారు.ఇబ్రహీంపట్నం ఎంపీడీవో నరేందర్‌రెడ్డి, ఈ వోఆర్డీ మహేశ్‌లు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనుమానాస్పదంగా పంచాయతీ కార్యాలయం దగ్ధమైందని, దీనిపై జిల్లా పరిషత్‌ సీఈవో, డీపీవోకు నివేదిక పంపారు.


logo