గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Sep 18, 2020 , 02:27:44

గర్భిణులు పోషకాహారాన్ని తీసుకోవాలి

గర్భిణులు పోషకాహారాన్ని తీసుకోవాలి

ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

ఎక్లాస్‌ఖాన్‌పేటలో పోషణ మాసోత్సవాలు

 కేశంపేట: కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ సూచించారు. కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేటలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసోత్సవాల్లో ఆయన మాట్లాడా రు.కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలు ఆ కు కూరలు, కూరగాయలు ఆహారంగా తీసుకుం టే శరీరానికి మంచి పోషకాలు అందుతాయన్నా రు. రాష్ట్ర ప్ర భుత్వం మహిళల సంక్షేమానికి ఎ న్నో కార్యక్రమాలు చేపడుతున్నదని, బాలింతల కోసం కేసీఆర్‌ కిట్టు,రూ.12వేల నగదు అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో పోషకాహారంపై ఏర్పాటు చేసిన స్టాల్‌లో కూరగాయలతో కలిగే  లాభాలపై మహిళలకు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ కవిత, ఎంపీపీ రవీందర్‌యాదవ్‌, జడ్పీటీసీ విశాల, డిప్యూటీ డీఎండీహెచ్‌వో దామోదర్‌రెడ్డి, ఐసీడీఎస్‌ సీడీపీవో నాగమణి, సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి, మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ లక్ష్మీనారాయణగౌడ్‌, మండల కోఆప్షన్‌ మెంబర్‌ జమాల్‌ఖాన్‌, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ అంజిరెడ్డి, ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో గణపతి,ఇఫ్కో  ప్రతినిధులు మారుతికుమార్‌, పార్టీ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి,యాదగిరిరావు, ప్రభాకర్‌రెడ్డి, శ్రావణ్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo