శనివారం 24 అక్టోబర్ 2020
Vikarabad - Sep 16, 2020 , 01:26:46

పోలీసుల పనితీరు మెరుగు పర్చేందుకు కృషి

 పోలీసుల పనితీరు మెరుగు పర్చేందుకు కృషి

  • అత్యాధునిక సాంకేతికతో అధికారులు, సిబ్బంది సర్వీస్‌ వివరాలన్నీ డిజిటలైజేషన్‌..
  • హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలో నమోదు చేస్తాం..
  • డీజీపీ మహేందర్‌రెడ్డి
  • వికారాబాద్‌ ఎస్పీ నారాయణ, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

వికారాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా పోలీస్‌ శాఖలో ఉన్న ప్రతి ఒక్క సిబ్బం ది వివరాలను హెచ్‌ఆర్‌ఎంఎస్‌ (హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) లో పొందుపర్చనున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ నారాయణ, పోలీస్‌ అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మాట్లాడారు.

అన్ని విభాగాల్లో అధునాతన సాంకేతికతో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ పోలీసుల పనితీరు మరింత మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆధునిక సాంకేతికలో భాగంగా అధికారులు, సిబ్బంది సర్వీస్‌ వివరాలను డిజిటలైజేషన్‌ చేయనున్నట్టు వివరించారు. సంబంధిత యూనిట్‌ అధికారులతో మాట్లాడి తగు సూచనలు చేసి ప్రతిఒక్కరి సర్వీస్‌ పూర్తి వివరాలను హెచ్‌ఆర్‌ఎంఎస్‌ సిస్టంలో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ నారాయణ, జిల్లా అదనపు ఎస్పీ రషీద్‌, ఏవో, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
logo