గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Sep 16, 2020 , 01:26:46

పందిరి సాగుతో అధిక దిగుబడులు : కలెక్టర్‌ పౌసుమిబసు

పందిరి సాగుతో అధిక దిగుబడులు : కలెక్టర్‌ పౌసుమిబసు

వికారాబాద్‌ : పందిళ్ల కింద సాగు చేసే పంటలతో రైతులు అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇదివరకు 2.20 ఎకరాల పొలం కలిగిన రైతులే అర్హులుగా ఉండగా, ఈ సారి పైలెట్‌ ప్రాజెక్టుగా ఐదు ఎకరాల పొలం కలిగిన రైతులకు అ వకాశం కల్పించామన్నారు. అయితే ఎస్సీ, బీసీ(సీ)లకు చెం దిన రైతులు మాత్రమే అర్హులని తెలిపారు.

ఈ స్కీం కింద మొత్తం రూ.3.50 లక్షల వి లువ గల పందిళ్లు, కడీలు, వైర్లు, మెల్బింగ్‌షీటు, సేంద్రీయ ఎరువులు, తైవాన్‌ స్ప్రేయ ర్లు, ప్లాస్టిక్‌ ట్రేలు మొదలైనవి ఇవ్వనున్నట్టు తెలిపారు. రైతులు అదనంగా పందిళ్ల కింద బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, దొండకాయ, చిక్కుడు, కాకరకాయ, బీన్స్‌ మొదలైన పంటలను పండించుకుని అధిక రాబడులు పొందవచ్చన్నారు. ఐదు ఎకరాలలో పు భూమి కలిగి ఎస్సీ, బీసీ(సీ)లకు చెందిన చిన్నకారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని కోరారు.

ఈ స్కీంకు దరఖాస్తు చేసుకునే రైతుల సంవత్సర ఆదాయం పట్టణ ప్రాంతాల్లో ఉండే రైతులకు రూ.2 లక్షలు, గ్రామాల్లో రూ.1.50 లక్షలు మించకూడదని తెలిపారు.పొలంలో బోరుబావి,విద్యుత్‌ సౌకర్యం ఉండి ఎకరా నుంచి ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కులం, ఆదాయం, ఆధార్‌కార్డు, భూమి పట్టా పాసుపుస్తకం, మూడు పాసుపోర్టుసైజ్‌ఫొటోలు, బోరు బావి ఫొటో, జిరాక్సులతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోదరఖాస్తు చేసుకోవాలన్నారు.

 25లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి

 పరిగి : రైతువేదిక, వైకుంఠధామం నిర్మాణ పనులు ఈనెల 25వ తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ పౌసుమిబసు సం బంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని నస్కల్‌ గ్రామాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సం దర్భంగా రైతువేదిక, వైకుంఠధామం నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, ఈనెల 25లోగా పూ ర్తి చేయాలని సూచించారు. ప్రధాన రోడ్లను మరింత పరిశుభ్రంగా మార్చాలన్నారు.ఇంటికొక ఇంకుడుగుంత నిర్మించాలని కలెక్టర్‌ సూచించారు.ఇంకుడుగుంతల నిర్మాణంతో వర్షపు నీరు, వృథా నీరంతా వాటి ద్వారా ఎక్కడికక్కడే భూ మిలోకి ఇంకిపోతాయన్నారు. తద్వారా మురుగునీరు రోడ్లపైకి రాకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండ ల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్‌, సర్పం చ్‌ మేడిద పద్మమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. logo