గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Sep 11, 2020 , 00:19:48

శివసాగర్‌కు పూర్వ వైభవం తీసుకురావాలి

శివసాగర్‌కు పూర్వ వైభవం తీసుకురావాలి

వికారాబాద్‌ : వికారాబాద్‌ శివసాగర్‌ చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. అసెంబ్లీ జీరో అవర్స్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుణ్యమా అని మిషన్‌ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని చెరువులు కళకళలాడుతున్నాయని, మొన్న కురిసిన వర్షాలకు వికారాబాద్‌ నియోజకవర్గంలోని కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్ట్‌లు అలుగు పారుతున్నాయన్నారు. కాని మున్సిపల్‌ పరిధిలోని శివసాగర్‌ చెరువు మాత్రం సగం కూడా నిండలేదన్నారు. గతంలో వికారాబాద్‌ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చిన చెరువు గత పాలకుల నిర్లక్ష్యంతో సగం కూడా నిండలేదని, 179 ఎకరాలు ఉన్న ఆ చెరువు ప్రస్తుతం కబ్జాలకు గురైందని, విచారణ చేపట్టి పూర్వ వైభవం తీసుకురావాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 


logo