మంగళవారం 27 అక్టోబర్ 2020
Vikarabad - Sep 10, 2020 , 00:20:08

సాఫీగా ఎంసెట్‌

సాఫీగా ఎంసెట్‌

  • పకడ్బందీగా కరోనా నిబంధనలు
  • గంట ముందునుంచి ప్రతీ  విద్యార్థికి థర్మల్‌స్క్రీనింగ్‌
  • మెయినాబాద్‌ మండలంలో మూడు పరీక్షాకేంద్రాలు
  • ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు 

 మొయినాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. రెండు దఫాలుగా ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. మొయినాబాద్‌ మండలంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అమ్డాపూర్‌ కూడలిలో ఉన్న జేబీఐఈటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉదయం , సాయంత్రం కలిసి 500 మందికి, హిమాయత్‌నగర్‌ రెవెన్యూలో ఉన్న విద్యాజ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాలలో 500, చిలుకూరు రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో 360 మంది పరీక్షలు రాయడానికి ఏర్పాట్లు చేశారు. జేబీఐఈటీలో ఉదయం, సాయంత్రం కలిసి 500 మంది హాజరుకావాల్సి ఉండగా 437మంది హాజరయ్యారు.విద్యాజ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాలలో 500మందికి 429మంది, కేజీరెడ్డిలో 303మంది విద్యార్థులు హాజరయ్యారు.  పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించడంతో మూడు గంటలు సమయం ఇచ్చారు. కొన్ని పరీక్ష కేంద్రాల్లో సర్వర్‌ ప్రాబ్లం ఉండడంతో విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఇబ్బందిపడ్డారు. ఆన్‌లైన్‌ సర్వర్‌ కొంత ఇబ్బంది కలిగించడంతో ఆ కేంద్రాల్లో పరీక్ష రాసిన విద్యార్థులకు అర గంట సమయం అదనంగా ఇచ్చారు. 

ప్రతి విద్యార్థికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు 

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దానిని అరికట్టడానికి పరీక్షా కేంద్రాల నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. విద్యార్థులు పరీక్ష హాల్‌లోకి వెళ్లే ముందు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. పరీక్ష ప్రారంభోత్సవానికి గంట ముందు నుంచే విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు చేయడం మొదలుపెట్టారు.logo