గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Sep 01, 2020 , 23:57:50

ఆన్‌లైన్‌ పాఠాలు షురూ..

ఆన్‌లైన్‌ పాఠాలు షురూ..

 తాండూరు రూరల్‌: విద్యా సంవత్సరం వృథా కాకుండా ప్రభుత్వం ఆన్‌లైన్‌ పాఠాలు మొదలు పెట్టినట్లు ఎంఈవో వెంకటయ్యగౌడ్‌ అన్నారు. మంగళవారం మండలంలోని అన్ని పాఠశాల పరిధిలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం వి ద్యార్థులు టీవీల ద్వారా ఇంటి వద్దనే ఉంటూ పాఠాలు వినాలని సూచించారు. అదేవిధంగా తాండూరు మండలం కోటబాసుపల్లి సర్పంచ్‌ నాగార్జున మంగళవారం పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ ఎం శ్రీనివాస్‌,వెంకట్రాంరెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 పూడూరు: ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు పిల్లలను ఆన్‌లైన్‌ క్లాసులు వినేలా చూడాలని ఎంఈవో హరిశ్చంద్ర పేర్కొన్నా రు. మంగళవారం పూడూరు మండల కేంద్రంలోని ఓ విద్యార్థి ఇంటి వద్ద దూరదర్శన్‌లో ఆన్‌లైన్‌ క్లాసులను హెచ్‌ఎం శ్రీశైలంతో కలిసి ఎంఈవో పరిశీలించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు జహంగీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 కులకచర్ల: మండలంలోని వివిధ గ్రామాల్లో విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. టీవీ,మొబైల్ల ద్వారా విద్యార్థులు తరగతులు చూసేలా ఉపా ధ్యాయులు వారి ఇండ్ల దగ్గర వెళ్లి అవగాహన కల్పించారు. 

 బషీరాబాద్‌: టీ శాట్‌ ద్వారా టీవీలో పాఠాలు చూపించాలని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించా రు. మంగళవారం రెడ్డి ఘణ పూర్‌, మంతట్టి, బషీరాబాద్‌, మైల్వార్‌, దామర్‌చేడ్‌ గ్రామాల్లో ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కా ర్యక్రమంలో హె చ్‌ఎం హీర్యానాయక్‌, ఉపాధ్యాయులు రవికాం త్‌, ఈశ్వర్‌, చం ద్రశేఖర్‌, రవికుమార్‌, యశోదాబాయి, సరిత పాల్గొన్నారు,


logo