గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Sep 01, 2020 , 00:22:05

మంత్రి కేటీఆర్‌కు ఎంపీ రంజిత్‌రెడ్డి చెక్కు అందజేత

మంత్రి కేటీఆర్‌కు ఎంపీ రంజిత్‌రెడ్డి చెక్కు అందజేత

వికారాబాద్‌: ఇంట్లో టీవీ లేని కారణంగా, ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో టీవీలను అందజేయనున్నట్లు ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. సోమవారం ప్రగతి భవన్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు  400 పైగా టీవీల కొనుగోళ్లకు తన సొంత విరాళంగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారని, వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే  మంత్రి కేటీఆర్‌ తెలంగాణను డిజిటలైజేషన్‌ దిశగా నడిపిస్తున్నారన్నారు. చేవెళ్ల  పార్లమెంట్‌ పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీలో టీవీలను ఈ-పరిపాలన కోసం వీడియో కాన్ఫరెన్స్‌, సమాచార సాధనాలుగా ఉపయోగించుకోవాలని స్థానిక సర్పంచ్‌లకు ఎంపీ సూచించారు. 


logo