గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Sep 01, 2020 , 01:50:14

వ్యవసాయ రంగానికి పెద్దపీట

వ్యవసాయ రంగానికి పెద్దపీట

  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • ఆరుట్లలో డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట  పరిశీలన 

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో రైతు శ్రీనివాస్‌ రెడ్డి సాగు చేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటను సోమవారం ఆయన సందర్శించారు. పంట సాగుకు ఖర్చు, ఇతర విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వ్యవసాయంలో యువ రైతులు నూతన పద్ధతులను అనుసరించి అధిక లాభాలు పొందుతున్నారన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగాలని సూచించారు.

మంచాల: వ్యవసాయ రంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సోమవారం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో రెండెకరాల్లో శ్రీనివాస్‌ రెడ్డి సాగు చేసిన డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటను ఆయన సందర్శించారు. పంట సాగు విషయం, ఎకరానికి ఎంత ఖర్చు వస్తున్నదని, తదితర విషయాలను రైతు శ్రీనివాస్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నదన్నారు. వ్యవసాయ రంగంలో యువకులు నూతన పద్ధతుల ద్వారా సాగుచేసుకుని అధిక లాభాలు పొందుతున్నారన్నారు. ప్రతిఒక్కరూ మట్టిని నమ్ముకుని వ్యవసాయాన్ని చేస్తున్నారని, ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, వారికి అండగా నిలుస్తున్నదని మంత్రి తెలిపారు.

రానున్న రోజుల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా మారుతుందని, ప్రతిఒక్కరూ వ్యవసాయంపైనే ప్రత్యేక దృష్టి పెడుతున్నారని చెప్పారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నియోజక వర్గంలోని  సాగునీరు కోసం నిరంతరం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని, రాబోయే రోజుల్లో శివన్నగూడ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నీటితో కళకళలాడనున్నాయని అన్నారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల్ల వెంకటేశ్వర్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్‌ బుస్సు పుల్లారెడ్డి, సర్పంచ్‌ కొంగర విష్ణు వర్ధన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ జంగయ్య గౌడ్‌, మాజీ చైర్మన్‌ సికిందర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి జ్యోతిశ్రీ, తహసీల్దార్‌ దేవోజా, నాయకులు రఘుపతి, వెంకట్‌రెడ్డి, చంద్రయ్య, సతీశ్‌ పాల్గొన్నారు. logo