బుధవారం 21 అక్టోబర్ 2020
Vikarabad - Aug 31, 2020 , 01:37:54

రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

శంకర్‌పల్లి : రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మార్కెట్‌ కార్యాలయంలో శంకర్‌పల్లి మార్కెట్‌ కమిటీ పాలకవర్గం చివరి  సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో రూ.కోటి 60లక్షలతో వివిధ రకాల అభివృద్ధి పనులు జరిగాయని ఇటీవలే రూ.50లక్షలతో నిర్మించిన నూతన కార్యాలయ భవనాన్ని మంత్రి సబితారెడ్డి ప్రారంభించారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి వారిని ఆదుకుంటున్నారని చెప్పారు

. ప్రతీ మండల కేంద్రంలో గోదాములు నిర్మించి రైతుల వద్ద కొనుగోలు చేస్తున్న ధాన్యం కందులు, శనగలు నిలువ చేస్తున్నారని తెలిపారు. ప్రతీ సంవత్సరం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని పేర్కొన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజు నాయక్‌ మాట్లాడుతూ రెండేండ్లు మార్కెట్‌ అభివృద్ధికి కృషి చేశామన్నారు. కాగా తాము పదవులలోకి రాగానే సంవత్సరంపాటు ఎన్నికలు జరిగాయని ఆ తరువాత కరోనా మహమ్మారి వచ్చిందన్నారు. అయినా అసంపూర్తిగా ఉన్న కార్యాలయ భవనాన్ని పూర్తి చేశామని తెలిపారు. తనకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే చైర్మన్‌, పాలకవర్గ సభ్యులకు శాలువాలు కప్పి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వీ.సత్యనారాయణ, గుడిమల్కాపూర్‌ ఏఎంసీ చైర్మన్‌ డీ.వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ బద్ధం శశిధర్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ సాత ప్రవీణ్‌కుమార్‌, కార్యదర్శి వెంకటయ్య, డైరెక్టర్లు శ్రీకాంత్‌రెడ్డి, పాండుయాదవ్‌, చంద్రశేఖర్‌రెడ్డి, రాంరెడ్డి, అబ్దుల్‌హక్‌, మాణెయ్య, సత్యనారాణరెడ్డి, సూపర్‌వైజర్‌ రాఘవేందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.


logo