శనివారం 31 అక్టోబర్ 2020
Vikarabad - Aug 27, 2020 , 04:33:13

చేపపిల్లల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం..

చేపపిల్లల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం..

  • మత్స్యకారులు చేపలు పట్టేందుకు అవసరమైన   పరికరాలు, వాహనాలు సబ్సిడీపై అందజేత...  
  • రెండు కల్వర్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తా: ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
  • పరిగి మండలం రంగంపల్లి ఎల్లమ్మ చెరువులో   చేపలు విడుదల

పరిగి : చేపల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేప పిల్లలను బుధవారం పరిగి మండలం రంగంపల్లి ఎల్లమ్మ చెరువులోఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి చెరువులోను వదిలేందుకు అవసరమైన చేప పిల్లలు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.


ఈసారి ఆగస్టు నెలలోనే చెరువులన్నీ నీటితో నిండడంతో చేపల పెంపకానికి మరింత అనువుగా ఉంటుందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల కుటుంబాలకు తోడ్పాటు అందిస్తున్నదన్నన్నారు. చేపలు పట్టేందుకు అవసరమైన పరికరాలు, వాహనాలు సబ్సిడీపై మత్స్యకారులకు అందిస్తున్నదని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా రంగంపల్లి నుంచి దోమ మండలం కిష్టాపూర్‌కు రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరగా అటవీ భూములు ఉండడంతో సంబంధిత శాఖ ద్వారా అనుమతులు వస్తేనే రోడ్డు నిర్మాణం సాధ్యమని ఎమ్మెల్యే చెప్పారు.

ముందుగా రెండు కల్వర్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఇందుకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు తయారు చేయించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవింద రావు, జడ్పీటీసీ హరిప్రియ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురేందర్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ, రంగంపల్లి, గడిసింగాపూర్‌ సర్పంచ్‌లు లక్ష్మీదేవి, అశోక్‌వర్దన్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు యాదయ్య, శ్రీనివాస్‌రెడ్డి, నరహరి, వారాల రవీంద్ర, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.