మంగళవారం 27 అక్టోబర్ 2020
Vikarabad - Aug 27, 2020 , 04:33:11

రైతు వేదికలను త్వరగా పూర్తిచేయాలి

రైతు వేదికలను త్వరగా పూర్తిచేయాలి

  • వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌

కులకచర్ల: రైతు వేదిక భవన నిర్మాణం పనులు త్వ రగా పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ పేర్కొన్నారు. బుధవారం కులకచర్ల మండల పరిధిలోని చౌడాపూర్‌ గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేధిక భవన నిర్మాణాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రైతువేదిక భవన నిర్మా ణాన్ని త్వరగా పూర్తి చేసే విధంగా చూడాలని గ్రామ సర్పంచ్‌ కొత్త రంగారెడ్డికి సూచించారు. రైతు వేదిక భవన నిర్మాణం పూర్తైతే రైతులకు ప్రభుత్వం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన పద్దతుల గురించి శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. త్వరగా రైతు వేధిక నిర్మాణం పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఎంపీటీసీ శంకర్‌, ఏఈవో అనిత, ఉపసర్పంచ్‌ శివకుమార్‌, వార్డు సభ్యులు అశోక్‌, రామకృష్ణ, శ్రీను, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు యాదయ్య, గ్రామస్తులు లక్ష్మయ్య, రాంజి పాల్గొన్నారు.


logo