శనివారం 24 అక్టోబర్ 2020
Vikarabad - Aug 27, 2020 , 07:05:20

ఇంటికో ఉద్యోగం... ఇంటి స్థలం..

ఇంటికో ఉద్యోగం... ఇంటి స్థలం..

  • ఫార్మాసిటీ భూ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటాం.... u
  • ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి  uవిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • uకందుకూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన

కందుకూరు : సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కృషి ఫలితంగా కందుకూరులో ఫార్మాసిటీ ఏర్పడుతున్నదని, దీంతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన వారికి ఇంటికో ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. కలుష్య రహిత కంపెనీలకు అనుమతులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించినట్లు చెప్పారు. ఇంటికో ఉద్యోగంతో పాటు 100గంజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం 20వేల ఎకరాలను సేకరిస్తున్నదని, ఇప్పటికే 10వేల ఎకరాలను సేకరించి టీఎస్‌ఐఐసీకి అప్పగించినట్లు వెల్లడించారు. బుధవారం  నేదునూరు పీడబ్ల్యూ డీ రోడ్డు నుండి బాచుపల్లి మీదుగా పులిమామిడి వరకు రూ.6కోట్ల 35లక్షలతో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణం కోసం, మాన్యగూడ తండా నుంచి దాసర్లపల్లి తండా వరకు రూ.80లక్షలతో నిర్మించే బీటీ రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదే విధంగా నేదునూరులో రూ.30లక్షలతో నిర్మించిన సీసీ, రూ.5లక్షలలతో నిర్మించిన అండర్‌ డ్రైనేజీలను చేవేళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డితో కలిసి  ప్రారంభించారు. అంబేద్కర్‌ చౌరస్తా వద్ద సర్పంచ్‌ కాసుల రామక్రిష్ణరెడ్డి అధ్యతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతిలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రం నుండి పీఎం జీఎస్‌వై కింద  158 రోడ్లకు 658 కోట్ల నిధులు విడుదలైనట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో పని చేస్తున్నారన్నారు. కరోనా కాలంలో పేదలకు ఉచిత బియ్యం, రైతు బంధు, బీమా, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత ప్రభుత్వానిదేనన్నారు. గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి ద్వారా కృషి జరుగుతున్నదని, అందులో భాగంగా ప్రతినెలా రూ.339కోట్లు నేరుగా పంచాయతీలకు ఇస్తున్నట్లు తెలిపారు. మహేశ్వరంలో నిర్మించి రైతు వేదికను సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పని చేస్తానని చెప్పారు.

రాష్ట్రంలోని  పథకాలు దేశానికే ఆదర్శం...

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షే మం పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నట్లు చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్‌లో ఇతర రాష్ర్టాల ఎంపీలు తెలంగాణ పథకాల గురించి అడుగుతుంటే సంతోషం కలుగుతున్నదన్నారు. గ్రామాలకు అభివృద్ధికి పార్లమెంట్‌లో పోరాడి నిధులు తీసుకువస్తానని తెలిపారు. 

రోడ్లకు సంబంధించి కేంద్ర సూచించిన విధంగా గూగుల్‌ మ్యాపింగ్‌తో నివేదికలు తయారు చేసి తనకు పంపాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవరశెట్టి చంద్రశేఖర్‌, వైఎస్‌ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ గోపిరెడ్డి విజేయేందర్‌రెడ్డి, నేదునూరు, దాసర్లపల్లి గ్రామాల సర్పంచ్‌లు కాసుల రామకృష్ణారెడ్డి, బాలమణి పాల్గొన్నారు.


logo