ఆదివారం 25 అక్టోబర్ 2020
Vikarabad - Aug 25, 2020 , 00:39:39

అభివృద్ధ్ది పనుల్లో వేగం పెంచండి

 అభివృద్ధ్ది పనుల్లో వేగం పెంచండి

జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ 

పరిగి,పూడూరు: అభివృద్ధి పనులలో వేగం పెంచాలని జి ల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ సూచించారు. సోమవారం పరిగిలోని మండల పరిషత్‌ కార్యాలయంలో, పూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనాలు అక్టోబర్‌ 15 వరకు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఈ మూడు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగేలా చూడాలని చెప్పారు.

మండలంలోని 11గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనా ల ఏర్పాటుకు భూములు లేకపోవడం వల్ల దాతల సహాయంతో భూమి దానం చేయించుకోవాలని అదనపు కలెక్టర్‌ పేర్కొన్నారు.సంబంధిత భూమి దానం చేసిన వారి పేరిటే ఉంటుందని, ఆ భూమిలో మొక్కలు నాటుతామని తెలిపా రు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు మరింత చొరవ తీసుకొని ఆయా గ్రామాల్లో భూములు దానం ఇచ్చే వారితో మాట్లాడాలని పేర్కొన్నారు. అదేవిధంగా రైతుల పంటలకు సరిపడా యూరియా ఉందని ఎలాంటి  కొరత లేదన్నారు. డీలర్లు యూరియా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు త ప్పవన్నారు. జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా మాట్లాడుతూ ఈనెల 31వ తేదీ వరకు వంద శాతం పన్నులు వ సూలు చేపట్టాలన్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మూడు నెలల్లోనే వంద శాతం పన్నుల వసూ లు చేపట్టాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు అవకాశం ఇచ్చారన్నారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా పన్నుల వసూలు చేపట్టాల్సిందిగా ఆ మె పేర్కొన్నారు. ఎంపీపీ అరవిందరావు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులు త్వరగా చేపట్టడం కోసం సర్పంచ్‌లు మరింత చొర వ చూపాలన్నారు. తాము సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధి పనుల్లో వేగం పెరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమం లో జడ్పీటీసీ హరిప్రియ, వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ, ఎంపీడీవోలు కృష్ణకుమార్‌, ఉష, ఎంపీవో దయానంద్‌, పీఆర్‌ ఈఈ మనోహర్‌రావు, తాసీల్దార్‌ దీపక్‌, ఏఈ శ్రీని వాస్‌ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.

      మండలంలో అభివృద్ధి పనుల వేగం పెంచాలి

 కులకచర్ల: కులకచర్ల మండలంలో అభివృద్ధి పనుల వేగం పెంచాలని ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్‌ తెలిపారు. సోమవారం కులకచర్ల మండ ల కేంద్రంలో సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి పనాలు, రైతువేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.సర్పంచులు,  కా ర్యదర్శులు సమిష్టిగా పనులు పూర్తిచేయాలని సూచించారు.


logo