శనివారం 31 అక్టోబర్ 2020
Vikarabad - Aug 24, 2020 , 01:54:59

గుర్తింపు కార్డులు పొందాలి

 గుర్తింపు కార్డులు పొందాలి

బొంరాస్‌పేట: భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు బీఓసీడబ్ల్యూ గుర్తిం పు కార్డులు తీసుకోవాలని జన సాహస్‌ సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ ప్రకాశ్‌కుమార్‌ అన్నారు. ఆది వారం మండలంలోని మూడుమామిళ్లతండాలో నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు బీఓసీడబ్ల్యూ కార్డులను అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ కార్డులున్నవారికి ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తుందని, కార్మి కుడి ఇద్దరు కూతుర్ల పెండ్లిళ్లకు రూ.30 వేలు, కాన్పులకు రూ.30 వేలు, ప్రమాదవశాత్తు మర ణిస్తే రూ.6 లక్షలు బీమా, శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.30 వేలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్ర మంలో సర్పంచ్‌ బద్యానాయక్‌, సంస్థ మండల కోఆర్డినేటర్‌ అశోక్‌ నాయక్‌ పాల్గొన్నారు.