బుధవారం 21 అక్టోబర్ 2020
Vikarabad - Aug 24, 2020 , 01:53:37

కొలువుదీరిన గణనాథులు

 కొలువుదీరిన గణనాథులు

వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని పట్టణాలు, గ్రామాల్లో గణనాథులు కొలువు  దీరాయి.  ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుక 9 నుంచి 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొన సాగేది. కరోనా విజృంభణతో వినాయక చవితి వేడుకల్లో సందడి లేకుండా పోయింది. అయినా పలుచోట్ల రంగు రంగుల కాగితాలు, విద్యుత్‌ దీపాలతో మండపాలను దేదీప్యమానంగా, సర్వాంగ సుందరంగా అలంకరిచారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించ డానికి ఈ ఏడాది చాలా చోట్ల మట్టి వినాయకులను ప్రతిష్ఠించారు.

పంటలు బాగా పం డాలని, కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రజలు ఏకదంతుడిని ప్రార్థించారు. భౌతిక దూరం పాటిస్తూ పూజల్లో పాల్గొన్నారు.  ప్రతి సంవత్సరం మాదిరిగా.. ఇప్పుడు తీన్మార్‌ స్టెప్పులు, ఆట పాటలు లేకపోవడంతో యువతలో నిరాశ కనిపిస్తున్నది. ఉత్సవాల సందడి, మండపాలు లేక వీధులన్నీ వెలవెలబోయాయి. గణనాథులు చాలావరకు ఇంటికే పరిమితమ  య్యాయి. పాలు, పండ్లు, వివిధ రకాల పండ్లు, పూలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. స్వామివారికి ఉండ్రాళ్లతోపాటు పాయసాన్ని నైవేద్యంగా సమ ర్పించారు.  రైతులు వ్యవసాయ పనిముట్లకు పూజలు చేశారు.

-వికారాబాద్‌/కొడంగల్‌ 


logo