ఆదివారం 25 అక్టోబర్ 2020
Vikarabad - Aug 24, 2020 , 01:53:35

5 మందికి కరోనా పాజిటివ్‌

5 మందికి కరోనా పాజిటివ్‌

పరిగి :  మున్సిపాలిటీలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు చిట్యాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ గౌస్‌ తెలిపారు. చిట్యాల్‌ పీహెచ్‌సీలో 32 మందికి, పరిగి ప్రభుత్వ దవాఖానలో ఐదుగురికి టెస్టులు  చేయగా.. 5 మందికి పాజిటివ్‌గా తేలిందన్నారు. కరోనా సోకినవారిలో పరిగి పట్టణానికి చెందినవారు నలుగురు, రూప్‌ఖాన్‌పేట్‌వాసి ఒకరు ఉన్నట్లు  పేర్కొన్నారు.  కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలన్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని, ఒకవేళ వచ్చినా భౌతికదూరం పాటించాలని సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టు చేయించుకోవాలని కోరారు. 

రాంపూర్‌లో ముగ్గురికి..

కులకచర్ల: మండలం పరిధి రాంపూర్‌లో శనివారం ముగ్గురు మహిళలకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ మురళికృష్ణ,  సీహెచ్‌వో చంద్రప్రకాశ్‌ తెలిపారు. వారికి మందులు అందజేసి హోం ఐసొలేషన్‌కు తరలించారు. logo