శనివారం 31 అక్టోబర్ 2020
Vikarabad - Aug 22, 2020 , 00:07:56

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 7వ స్థానం సంతోషకరం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 7వ స్థానం సంతోషకరం

  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల

వికారాబాద్‌ : స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020లో వికారాబాద్‌ మున్సిపాలిటీ రాష్ట్రంలోనే 7వ స్థానం సాధించడం సంతోషంగా ఉంద ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో శుక్రవారం వికారాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కార్మికులు, సిబ్బందిని సత్కరించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. గతంలో 13వ స్థానంలో ఉన్న వికారాబాద్‌ మున్సిపాలిటీ ప్రస్తుతం 7వ స్థానం సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు. సౌత్‌ జోన్‌లో గతంలో 71వ స్థానంలో ఉండగా ప్రస్తు తం 67వ స్థానం సాధించిందన్నారు. ఇందుకు కౌన్సిలర్లు, కమిషనర్‌, కార్మికులు, సిబ్బంది సహకరించారని, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌ అభివృద్ధిని దగ్గరుండి జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని ఆమె వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతున్నదని, ఎన్నో ఏండ్లుగా పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగిపోయి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంషాద్‌బేగం, మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.