బుధవారం 21 అక్టోబర్ 2020
Vikarabad - Aug 19, 2020 , 00:24:23

అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు

అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు

కొడంగల్‌ : అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించకుండా త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పౌసుమి బసు ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవా రం స్థానిక పశువుల దవాఖాన ఆవరణలోని శిక్షణ కేంద్ర భవనంలో కొడంగల్‌ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీరాజ్‌, విద్యుత్‌, మిషన్‌ భగీరథ, అటవీశాఖ, నీటిపారుదల, మెప్మా మండలాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు  పనుల జాప్యానికి గల కారణాలను తెలుసుకొని  అధికారులకు పలు సూచనలు, సలహాలను అందించారు.  పనుల వేగవంతంపై చర్యలు తీసుకోవాలని,  గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని  సూచించారు.  కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, ఆర్డీవో అశోక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, కొడంగల్‌, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల తాసిల్దార్‌లు, మున్సిపల్‌ కౌన్సిలర్‌లు పాల్గొన్నారు. 

యేటి కాల్వను పరిశీలించిన కలెక్టర్‌

బొంరాస్‌పేట: పెద్ద చెరువులోకి వరద నీరు వచ్చే యేటి కాల్వను కలెక్టర్‌ పౌసుమిబసు మంగళవారం పరిశీలించారు. కొడంగల్‌కు వెళ్తూ మార్గమధ్యలో ఆగి కాల్వను పరిశీలించారు. వరద నీరు రావడానికి కాల్వలో అడ్డంగా రాళ్లు ఉన్నాయని వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తే అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, వరద ఎక్కువైతే కాల్వకు గండిపడి నీరు వృథా అయ్యే అవకాశం ఉందని అక్కడే ఉన్న సర్పంచ్‌ కొడుకు వీరేశం కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. అడ్డంగా ఉన్న రాళ్లు, మట్టిని తొలగిస్తే చెరువులోకి వరద నీరు సాఫీగా వస్తుందని అన్నారు. అటవీశాఖ అధికారులతో మాట్లాడి రాళ్లను తొలగించేలా ఆదేశాలు ఇస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. logo