గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Aug 19, 2020 , 00:24:21

చకచకా వైకుంఠధామాల పనులు

చకచకా వైకుంఠధామాల పనులు

 కొత్తూరు: పేదలు, భూమిలేని వారు వారి కుటుంబీకులకు మర్యాద పూర్వకంగా దహన సంస్కారాలు నిర్వహించు కోవడానికి ప్రతి ఊరికి ఒక వైకుంఠధామం నిర్మించాలనేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంకల్పం. అందుకోసం ఎన్ని నిధులై నా ఖర్చు చేయడానికి సిద్ధమని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అధికారులుకు కూడా ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీంతో ప్రతి గ్రామంలో ఓ వైకుంఠ ధామం రూపుదిద్దుకుంటుంది. శ్మశానవాటికను ఏర్పాటు చేయడమే కాకుండా అందులో సకల వసతులు కల్పిస్తు న్నారు. వైకుంఠధామం చుట్టూ కంచెను నిర్మిస్తున్నారు. లో పలికి వెళ్లడానికి గేటును ఏర్పాటు చేస్తున్నారు. లోపల స్నా నాల గదులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే స్త్రీలు దుస్తులు మార్చుకోవడానికి ఓ హాలు కూడా నిర్మిస్తున్నారు. ము ఖ్యంగా నీటి వసతి కల్పిస్తున్నారు. కొత్తూరు, నందిగామ మండలాల్లో వైకుంఠధామాల పనులు జరుగుతున్నాయి. 

కొత్తూరు మండలంలో..

14 గ్రామ పంచాయతీలకుగాను తొమ్మిదింటిలో 100 శాతం వైకుంఠధామాల పనులు పూర్తయ్యాయి.  కొడిచర్ల తండా, వైఎంతండా గ్రామ పంచాయతీల్లో బేస్‌మెంట్‌ లె వల్‌లో పనులు నడుస్తున్నాయి. మక్తగూడ, మల్లాపూర్‌ తండా గ్రామ పంచాయతీల్లో స్లాబ్‌ లెవల్‌లో పనులు నడు స్తున్నాయని ఎంపీడీవో జ్యోతి తెలిపారు. ఆగస్టు 30 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో 100 శాతం పనులు పూర్తి చేస్తామని ఎంపీడీవో స్పష్టం చేశారు. 

నందిగామ మండలంలో..

 నందిగామ మండలంలోని 18 గ్రామ పంచాయతీకు గా ను ఈర్లపల్లి, నర్సప్పగూడ, మేకగూడ గ్రామ పంచాయ తీల్లో ఇప్పటికే వైకుంఠధామాలు పూర్తయ్యాయి. అలాగే 13 గ్రామ పంచాయతీలో శ్మశానవాటిక పనులు వివిధ దశ ల్లో ఉన్నాయి. ఈలాగే ఈదులపల్లి, తాళ్లగూడ గ్రామ పం చాయతీల్లో వివిధ కారణాలతో పనులు ఇంకా మొదలు కాలేదని ఎంపీడీవో బాల్‌రెడ్డి తెలిపారు. మిగతావి కూడా ప్రారంభించి సాధ్యమైనంత త్వరలో మండలంలోని అన్ని వైకుంఠధామాల పనులు పూర్తి చేస్తామని పంచాయతీరాజ్‌ ఏఈ హేమంత్‌ తెలిపారు.  


logo